‘ఆర్ ఆర్ ఆర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ముంబాయ్ లో జరిగింది. ఈమూవీలోని కీలక నటీనటులు పాల్గొన్న ఈ ఈవెంట్ కు బాలీవుడ్ టాప్ హీరో సల్మాన్ ఖాన్ ముఖ్య అతిధిగా వచ్చాడు. ‘ఆర్ ఆర్ ఆర్’ ఒక రేంజ్ లో ప్రశంసలు కురిపిస్తూ సల్మాన్ రాజమౌళిని ఆకాశానికి ఎత్తేశాడు. ‘ఆర్ ఆర్ ఆర్’ విడుదలైన తరువాత మరో 4 నెలల వరకు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో మరొక భారీ సినిమా విడుదల చేయడం మంచిది కాదనీ కనీసం ‘ఆర్ ఆర్ ఆర్’ మ్యానియా మూడు నెలలు దేశవ్యాప్తంగా ఉండటం ఖాయం అంటూ జోశ్యం చెప్పాడు.


అంతేకాదు రాజమౌళి అవకాశం ఇస్తే తాను జక్కన్న తీసే సినిమాలో చిన్నపాత్రను అయినా చేయడానికి రెడీ అంటూ సంచలన వ్యాఖ్యలు చేసాడు. ఇక ఈమూవీలో నటించిన రామ్ చరణ్ గురించి మాట్లాడుతూ తాను ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా చరణ్ ఏదోఒక గాయంతో తనకు కనిపిస్తూ ఉంటాడని అలా గాయాలను కూడ లెక్కచేయకుండా సినిమాల కోసం కష్టపడుతున్న చరణ్ కమిట్మెంట్ చూస్తే తనకు ఎంతో ఆనందం కలుగుతుంది అంటూ చరణ్ లాంటి కొడుకు చిరంజీవికి ఉండటం ఆయన అదృష్టం అంటూ కామెంట్స్ చేసాడు.


ఇక ఈమూవీలో మరో హీరోగా నటించిన ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ తనకు సీనియర్ ఎన్టీఆర్ తో నటించే అవకాశం దక్కలేదని అయినప్పటికీ ఎప్పుడోకప్పుడు తాను జూనియర్ తో నటించడానికి రెడీ అంటూ ప్రశంసలు కురిపించాడు. ఈప్రశంసలకు జూనియర్ స్పందిస్తూ తాను జీవితంలో సల్మాన్ పక్కన ఒకే వేదిక పై కూర్చుంటాను అని ఎప్పుడు అనుకోలేదని ఇది అంతా తనకు కల లా అనిపిస్తోంది అంటూ కామెంట్స్ చేసాడు.


ప్రస్తుతం బాలీవుడ్ మీడియా కూడ ‘ఆర్ ఆర్ ఆర్’ విషయంలో చాల పాజిటివ్ గా స్పందిస్తోంది. ఈ ఫంక్షన్ వివరాలను బాలీవుడ్ మీడియా చాల ప్రముఖంగా ప్రచురించింది. సల్మాన్ ఖాన్ ‘ఆర్ ఆర్ ఆర్’ విడుదల తరువాత మరొక సినిమా విడుదల అవ్వడం అంత మంచిది కాదు అని చెపుతుంటే మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మటుకు ‘ఆర్ ఆర్ ఆర్’ కు భయపడకుండా ‘భీమ్లా నాయక్’ ‘రాథే శ్యామ్’ ‘బంగార్రాజు’ సినిమాలు విడుదల అవ్వడం ఒక విధంగా షాకింగ్ అనుకోవాలి..



మరింత సమాచారం తెలుసుకోండి: