ఈ విషయంలో పవర్ స్టార్ ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు. అంతేకాదు భీమ్లా నాయక్ సినిమా వేసినందుకు రాజమౌళి పవర్ స్టార్ కు సరిగా కృతజ్ఞత తెలపలేదని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే లేటెస్ట్ గా నిహారికా కూడా భీంలా నాయక్ పోస్ట్ పోన్ విషయంపై స్పందించింది. మా బాబాయ్ ఓ సినిమాలో చెప్పినట్టుగా రావడం కాస్త లేట్ అవ్వొచ్చు కానీ రావడం మాత్రం పక్కా అన్నట్టుగా.. రిలీజ్ కావడం కాస్త లేట్ అవ్వొచ్చు కానీ బాక్సాఫీస్ బద్ధలు కొట్టడం పక్కా అని అన్నారు నిహారిక. ప్రస్తుతం ఈ కామెంట్ పవర్ స్టార్ ఫ్యాన్స్ ని విశేషంగా ఆకట్టుకుంటుంది.
అంతేకాదు జనవరి 7న రిలీజ్ అవబోతున్న ఆర్.ఆర్.ఆర్ సినిమాపై కూడా నిహారిక స్పందించారు. తారక్ అన్న తనకు ఎన్నో ఏల్లుగా తెలుసు.. ఆయన సతీమణి ప్రణతి నా క్లాసే మెట్.. ఆయన ఎనర్జీ మరోస్థాయిలో ఉంటుందని.. ట్రిపుల్ ఆర్ ట్రైలర్ చూశాక చరణ్ ని ప్రత్యేకంగా కలిసి తన అభినందనలు తెలిపానని అన్నారు నిహారిక. రీసెంట్ గా ఓ థియేటర్ లో ఆర్.ఆర్.ఆర్ ట్రైలర్ చూశానని గూస్ బంప్స్ వచ్చాయని.. చరణ్ సోదరిగా ఈ మాట చెప్పడం లేదని.. ఒక ప్రేక్షకురాలిగా చెబుతున్నా అని అన్నారు నిహారిక. సినిమా కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నా అని నిహారిక చెప్పారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి