ఆ సినిమా ఫ్లాప్ అయ్యిందంటే అందులో అభిమానులకు నా పర్ ఫామెన్స్ నచ్చలేదు..సో నేను ఇంకా వాళ్లకు నచ్చేలా సినిమా స్టోరీ ఉండేలా ప్లాన్ చేసుకోవాలి..దానికి నేను కష్టపడాలి అని తనకు తానే సర్ధి చెప్పుకుని..ఎట్టకేలకు మళ్లీ హిట్ లు కొట్టాడు. బన్నీ మొదటి నుండి కూడా అంతేనట. చాలా మొండివాడట. తాను ఏదైన కావాలి అని అనుకుంటే అది సాధించేవరకు వదిలిపెట్టడట. చిన్నతనంలో కూడా ఇలాంటి బీహేవియర్ తోనే అల్లు అరవింద్ దగ్గర బాగా దెబ్బలు తిన్నేవారట. చిన్నతనంలో బన్నీ బాగా అల్లరి చేసేవారట. దీంతో అల్లు అర్జున్ ను కంట్రోల్ చేయలేక అల్లు అరవింద్ బాగా ఇబ్బందులు పడ్డారట. చిన్నప్పటినుండి అదే మొండితనాని మెయింటైన్ చేస్తూ వచ్చిన బన్నీ ఇప్పటికి కూడా అలాగే బీహేవ్ చేస్తాడట.
రీసెంట్ గా రిలీజైన పుష్ప సినిమా బన్నీకి ఎంతటి మంచిపేరు తీసుకొచ్చిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 80% ఈ సినిమా సక్సెస్ కావడానికి కారణం బన్నీ కష్టం అంటూ డైరెక్టర్ సుకుమార్ డైరెక్ట్ గానే చెప్పారు. ఇక బన్ని ఎంత మొండివాడు అనేది ఈ సినిమాలో ఓ షాట్ ద్వారా మళ్ళి ప్రూవ్ చేసుకున్నాడు. పుష్ప సినిమాలో ఏయ్ బిడ్డ ఇది నా అడ్డ అంటూ వచ్చే సాంగ్ లో ఓ సీన్ లో బన్నీ 24 షర్ట్ లు మార్చారట. దానికోసం ఏకంగా 12గంటలు కష్టపడ్డారట. గ్యాప్ తీసుకోకుండా బన్నీ కంటీన్యూ గా షాట్స్ కి రెడీ అయ్యారట. సుకుమార్ బన్నీ రెస్ట్ తీసుకో నెక్స్ట్ షట్ రేపు ప్లాన్ చేద్దాం అన్నా కూడా వినకుండా మొండిగా బిహేవ్ చేసి..ఫైనల్ గా ఆ సీన్ కంప్లీట్ చేసారట. దీంతో బన్నీ ఈ సినిమాకోసం ఎంత కష్టపడ్డారో అంటూ అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు.