ప్రస్తుతం టాలీవుడ్ మన్మథుడు గా కొనసాగుతున్న అక్కినేని నాగార్జునపై ఎంతో బాధ్యత వచ్చి పడినట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం పరిశ్రమలో రాణిస్తున్న ఇద్దరు కొడుకులకు పెళ్లి చేసి ఓ ఇంటి వాళ్లను చేయాలని నాగార్జున అనుకుంటున్నారట. అయితే గతంలోనే అఖిల్ పెళ్లి కావాల్సి ఉంది. ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు పెద్దలను ఒప్పించి నిశ్చితార్థం కూడా చేసుకున్నాడు. కానీ ఆ తర్వాత నిశ్చితార్థం పెళ్లి రెండు క్యాన్సిల్ అయిపోయాయి. దీంతో అఖిల్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గానే మిగిలిపోయాడు. ప్రేమలో మునిగి తేలి పెళ్లి తో ఒకటైన నాగచైతన్య సమంత జంట ఇటీవలే అనూహ్య నిర్ణయం తీసుకుంది.


 తమ దాంపత్య బంధానికి స్వస్తిపలుకుతున్నాము అని మా ఇద్దరి దారులు వేరే అంటూ చెప్పి విడాకులు తీసుకున్నట్లు సోషల్ మీడియాలో ప్రకటించి షాక్ ఇచ్చింది ఈ జంట. దీంతో ఇక ఇప్పుడు సమంత దూరం కావడంతో నాగచైతన్య కూడా సింగిల్ గా మారిపోయాడు. ఇకపోతే నాగ చైతన్య  విడాకులు తీసుకున్నట్లు ప్రకటించినప్పటికీ అఫీషియల్గా ఈ ప్రక్రియ పూర్తి కావడానికి కాస్త సమయం పట్టే అవకాశం ఉందట. ఈ క్రమంలోనే ఈ గ్యాప్లో అఖిల్ పెళ్లి చేయాలని నాగార్జున మాస్టర్ ప్లాన్ సిద్ధం చేశాడట. ఈ క్రమంలోనే అసలు సినిమా ఇండస్ట్రీతో సంబంధం లేని అమ్మాయిని అఖిల్ కోసం నాగార్జున  చూసాడని ప్రస్తుతం ఒక టాక్ వైరల్ గా మారిపోయింది.


అక్కినేని ఫ్యామిలీకి బోలెడంత ఆస్తి ఉంది. దీంతో ఆస్థి తక్కువగా ఉన్నా అమ్మాయి బాగుండడంతో ఇక నాగార్జున ఓకే చేశాడట. కొన్ని రోజుల్లో దీనికి సంబంధించి నాగార్జున మనసులో మాట బయటపెట్టి అభిమానులకు సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాడు అంటూ ఒక టాక్ టాలీవుడ్లో చక్కర్లు కొడుతుంది. అఖిల్ పెళ్లి ముగిసిన తర్వాత అటు పెద్ద కొడుకు నాగచైతన్య కు కూడా మరో పెళ్లి చేయాలని అనుకుంటున్నాడట. ఇలా  ఇంటికి కొత్త కోడళ్లను తీసుకురావాలని నాగార్జున మాస్టర్ ప్లాన్ సిద్ధం చేశాడంటూ ఒక గాసిప్ చక్కర్లు కొడుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: