ఇన్నాళ్లు డిస్ట్రిబ్యూటర్ గా నిర్మాతగా సక్సెస్ ని ఎంజాయ్ చేసిన దిల్ రాజు తన ఫ్యామిలీ నుండి మొదటిసారి హీరోని పరిచయం చేశాడు. దిల్ రాజు బ్రదర్ శిరీష్ తనయుడు ఆశిష్ హీరోగా రౌడీ బాయ్స్ సినిమా చేశాడు. హర్ష డైరక్షన్ లో తెరకెక్కిన ఈ మూవీని ఎక్కడ కాంప్రమైజ్ అవకుండా తీశారు. సినిమాలో మళయాళ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది. అనుపమని ఇదివరకు ఎప్పుడూ చూపించిన హాట్ యాంగిల్ లో ఈ రౌడీ బాయ్స్ లో చూపించారు. అందుకు అమ్మడికి బాగానే రెమ్యునరేషన్ ముట్టచెప్పారని టాక్.

అయితే కొత్త హీరో సినిమాకు అనుపమ ఈ రేంజ్ లో రెచ్చిపోవడం ఆమె ఫ్యాన్స్ ని కొద్దిగా హర్ట్ అయ్యేలా చేసింది. ఇదిలాఉంటే ఎంతో భారీ బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా వసూళ్లు మాత్రం మాములుగానే ఉన్నాయి. సంక్రాంతి కానుకగా జనవరి 14న రిలీజైన రౌడీ బాయ్స్ సినిమా పోటీగా వచ్చిన బంగారాజు ముందు బోల్తా కొట్టింది. సినిమా 11.5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ తో రిలీజ్ అయ్యింది. అయితే 3 రోజుల్లో ఇప్పటివరకు 2.83 కోట్లని మాత్రమే కలెక్ట్ చేసిందని తెలుస్తుంది. డెబ్యూ హీరో మూవీకి ఈ రేంజ్ కలక్షన్స్ రికార్డ్ అని చెప్పొచ్చు.

దిల్ రాజు తన ఫ్యామిలీ హీరో అనేసరికి సినిమాకు అవసరానికి మించి బడ్జెట్ పెట్టాడు. అందుకే సినిమా 12 కోట్ల దాకా బిజినెస్ చేసింది. సినిమాలో క్రేజీ హీరోయిన్ ఉన్నా సరే హీరో ఇమేజ్ ని బట్టి వసూళ్లు ఉంటాయి. ఇక రౌడీ బాయ్స్ హిట్ అనిపించుకోవాలంటే ఇంకా 9 కోట్ల దాకా రాబట్టాల్సి ఉంటుంది. హీరోగా ఆశిష్ కు పాస్ మార్కులు పడినట్టే అని చెప్పుకుంటున్నారు. అయితే రౌడీ బాయ్స్ సినిమాలో అనుపమ లిప్ లాక్, ఇంటిమేట్ సీన్స్ మాత్రం ఆడియెన్స్ ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. అనుపమని ఇలాంటి డిఫరెంట్ యాంగిల్ లో చూసి ఆడియెన్స్ షాక్ అవుతున్నారని చెప్పొచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: