యువకుడు సినిమాతో తెలుగు తెరకు పరిచయమై మహేష్, పవన్, ఎన్.టి.ఆర్ లాంటి స్టార్ హీరోలందరితో నటించిన భామ భూమిక చావ్లా. హీరోయిన్ గా కెరియర్ ముగించి రీ ఎంట్రీలో సపోర్టింగ్ రోల్స్ తో సత్తా చాటుతుంది భూమిక. తెలుగుతో పాటుగా తమిళ, హిందీ భాషల్లో కూడా భూమిక వరుస సినిమాలు చేస్తూ సత్తా చాటుతుంది. 20 ఏళ్ల కెరియర్ లో ఎప్పుడూ తన పరిధి దాటి నటించని భూమిక లేటెస్ట్ గా తన ఇన్ స్టాగ్రాం లో ఏకంగా స్విమ్మింగ్ పూల్ లో స్విమ్ చేస్తూ షాక్ ఇచ్చింది.

స్విమ్ డ్రెస్ లో పర్సనల్ వీడియోని ఇలా భూమిక తన ఇన్ స్టాగ్రాం లో షేర్ చేయడం పట్ల అభిమానులు షాక్ అవుతున్నారు. ఆమె ఏ భాషలో సినిమాలు చేసినా భూమికకి తెలుగులో మాత్రం సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కెరియర్ పరంగా సినిమాలు, వెబ్ సీరీస్ లు అనే తేడా లేకుండా అన్ని భాషల్లో ఎలాంటి ఛాన్స్ వచ్చినా చేసేస్తుంది భూమిక. తెలుగులో లాస్ట్ ఇయర్ వచ్చిన పాగల్, సీటీమార్, ఇదే మా కథ సినిమాల్లో నటించింది భూమిక చావ్లా.

ఇన్నాళ్లు గ్లామర్ షో విషయంలో అసలు కాంప్రమైజ్ కాని భూమిక ఇలా సడెన్ గా పూల్ వీడియోతో స్విమ్ డ్రెస్ లో షాక్ ఇచ్చింది. సోలో హీరోయిన్ గా ఛాన్స్ లేకపోయినా తనలో ఇంకా అలాంటి ఓ లీడ్ ఛాన్స్ వస్తే ప్రూవ్ చేసుకోవాలన్న తపన ఉందని అనిపిస్తుంది. ఒకప్పుడు స్టార్స్ సరసన నటించిన భూమిక ఇప్పుడు యువ హీరోలకి అక్క, వదిన పాత్రలతో సరిపెట్టుకుంటుంది. మరి భూమికలో ఈ మార్పు తన సినీ కెరియర్ కోసమా లేక ఇన్నాళ్లు అలా ఉండి ఏం చేశాం తన ఫ్యాన్స్ ని సంతోషపెట్టేందుకు గ్లామర్ షో కి సిద్ధమైందా అన్నది తెలియాల్సి ఉంది.  


 


మరింత సమాచారం తెలుసుకోండి: