కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ముద్దుల కూతురు మంచు లక్ష్మి, సిద్ధార్థ్ హీరోగా తెరకెక్కిన అనగనగా ఓ ధీరుడు సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది, ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా పడినప్పటికీ ఈ సినిమాలో మంచు లక్ష్మి ప్రతినాయక పాత్రకు మాత్రం టాలీవుడ్ ప్రేక్షకుల నుంచి మంచి ప్రశంసలు దక్కాయి. అనగనగా ధీరుడు సినిమాతో మంచి నటిగా తనను తాను ప్రూవ్ చేసుకున్న మంచు లక్ష్మి ఆ తర్వాత అనేక సినిమాలలో నటించి టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది, మంచు లక్ష్మి కేవలం సినిమాలతో మాత్రమే కాకుండా అనేక టీవీ షో లకు, ఓటిటి షో లకు హోస్ట్ గా వ్యవహరించి కూడా ప్రేక్షకులను అలరించింది, ఇవి మాత్రమే కాకుండా మంచు లక్ష్మి వెబ్ సిరీస్ లో కూడా నటించింది.

 ఇలా సినిమాలతో,  వెబ్ సిరీస్ లతో, టీవీ షోలకు, ఓటిటి షో లకు హోస్ట్ గా వ్యవహరిస్తూ ఫుల్ బిజీగా సమయాన్ని గడుపుతున్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులతో అనేక విషయాలను పెంచుకుంటూ ఉంటుంది, తన షూటింగ్ అప్డేట్ లను,  ఇతర విషయాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో పంచుకుంటూ ఉంటే ఈ ముద్దుగుమ్మ అప్పుడప్పుడు తన అందచందాలు ప్రదర్శితమయ్యేల ఉన్న ఫోటోలను కూడా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ ఉంటుంది.  తాజాగా కూడా ఈ ముద్దుగుమ్మ ఒక ఫోటోను తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసింది,  ఈ ఫోటోలో మంచు లక్ష్మి గోల్డ్ కలర్ శారీ ని కట్టుకొని, అందుకు తగిన స్లీవ్ లెస్ బ్లౌజ్ ను ధరించి అదిరిపోయే లుక్ లో ఫోటో కి స్టైల్ ఇచ్చింది, ప్రస్తుతం మంచు లక్ష్మి కి సంబంధించిన ఈ ఫోటో నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: