నందమూరి బాలకృష్ణ ఇప్పుడు మళ్ళీ ఫామ్ లోకి వచ్చాడు. ఇటీవల బాలయ్య నటించిన తాజా చిత్రం అఖండ.. మొన్నీమధ్య విడుదల అయిన ఈ సినిమా విడుదల అయ్యింది. భారీ విజయాన్ని అందుకుంది. బోయపాటి శీను, బాలాయ్య కాంబినేషన్లో వచ్చిన మూడో సినిమా ఇది. గతంలో వచ్చిన సింహా, లెజెండ్ సినిమాలు భారీ హిట్ ను అందుకున్నాయి. ఇప్పుడు వచ్చిన సినిమా కూడా భారీ హిట్ ను అందుకుంది.. మొత్తాని కి బాలయ్య ఖాతా లో మరో హిట్ పడింది.


సినిమా విడుదల అయ్యి ఏడు వారాలు అయ్యింది. బాక్సాఫీస్ బరిలో సత్తా చాటుతూ విజయ వంతంగా 50 రోజుల వైపు పరుగులు తీస్తుంది. సంక్రాంతి కానుక గా 'అఖండ' టైటిల్ సాంగ్ ను విడుదల చేశారు. ఆ సాంగ్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అమ్మ' సాంగ్ విడుదల చేశారు. తాజాగా ఈ సినిమా నుంచి అమ్మ  పై వచ్చిన పాట ను విడుదల చేశారు. థమన్ ట్యూన్ కంపోజ్ చెయ్యగా ధర్మం కోసం దూరం అయితే ఒకడూ దైవం అంటూ దారే మారేనొకడూ అమ్మా అంటూ పిలిచిన వాడు లేడు.. అనే లిరిక్స్ జనాలను విపరీతంగా ఆకట్టుకుంది.


రచయిత కళ్యాణ్ చక్రవర్తి అమ్మ బాధ ను వర్ణిస్తూ కంటతడి పెట్టించేలా లిరిక్స్ రాశారు. మోహనా భోగరాజు అద్భుతంగా పాడారు. సినిమాలో ఈ పాట వస్తున్నంత సేపు  ప్రేక్షకులు కంటతడి పెడుతూన్నారు. అంత అద్బుథంగా పాట లిరిక్స్ ఉంటాయి. మిర్యాల సత్య నారాయణ రెడ్డి సమర్పణ లో ద్వారకా క్రియేషన్స్ పతాకం పై యువ నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన 'అఖండ' సినిమా ఘన విజయాన్ని అందుకోవడం తో పాటుగా భారీ కలెక్షన్స్ ను కూడా అందుకోవడం విశేషం. ఆ పాట ఎంత బాగుందొ మీరు ఒకసారి వినండి.
 

మరింత సమాచారం తెలుసుకోండి: