బుల్లితెరపై ఈటీవీలో ప్రసారంపై అయ్యే జబర్దస్త్ షో యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమె ఎప్పడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండటంతో పాటు పలు సందర్భాల్లో వివాదాల ద్వారా వార్తల్లో నిలిచిన సంగతి అందరికి తెలిసిందే. అనసూయ వెండితెరపై కూడా తన హవా కొనసాగిస్తుంది. రామ్ చరణ్ నటించిన రంగస్థలం సినిమాలో రంగమ్మ అత్తగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలాగే అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాలో దాక్షాయణి రోల్ లో అనసూయ మెప్పించగా ఆమె పాత్ర నిడివి మరీ తక్కువగా ఉన్నట్లు కామెంట్స్ వినపడుతున్నాయి.

సుకుమార్ దర్శకత్వంలో నిర్మిస్తున్న పుష్ప పార్ట్2 లో అనసూయ పాత్రకు ఎక్కువగానే ప్రాధాన్యత ఇచ్చారని సమాచారం. అయితే ఈ ఏడాదే పుష్ప పార్ట్2 విడుదల కానున్నట్లు తెలుస్తోంది. ఇక సోషల్ మీడియాలో అనసూయ ఈ మధ్య కాలంలో తరచూ ట్రోల్స్ కు గురవుతూనే ఉంటుంది. అంతేకాదు.. అనసూయ నెటిజన్లతో ముచ్చటిస్తుండగా ఒక నెటిజన్ అనసూయ ఆంటీ లేదా అక్కా ఏమని పిలవాలి అని ప్రశ్నించాడు.  

ఆ విషయంపై అనసూయ బదులిస్తూ నేను నీకు అంత ఎక్కువగా పరిచయం లేదని అలా పిలవాల్సిన అవసరం లేదని కామెంట్లు చేసింది. ఆ వ్యక్తి చేసిన కామెంట్ ఏజ్ షేమింగ్ కిందికి వస్తుందని నీ పెంపకంపై అనుమానం వస్తుందని అనసూయ చెప్పుకొచ్చాడు. కాగా.. అనసూయ నెటిజన్ కామెంట్ కు ఆ విధంగా సమాధానం ఇవ్వడం సరికాదని చాలామంది నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అనసూయని అక్క అని పిలిస్తే ఆ పిలుపు ఏజ్ షేమింగ్ కాదని అలాంటప్పుడు ప్రశంసలు తీసుకోవడం కూడా కరెక్ట్ కాదని   మరో వ్యక్తి అన్నారు. ఇక ఆ వ్యక్తి చేసిన కామెంట్ పై అనసూయ స్పందిస్తూ అలా పిలవడం ఏజ్ షేమింగ్ కాకపోయినా నేను ఏం చెప్పానో మీకు తెలుసని ఆమె అన్నారు. అయితే ప్రశంసలు తీసుకోవాలా? వద్దా? అనేది ఒకరి ఇష్టమని ఆమె తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: