బుల్లి తెర హీరోయిన్ నవ్య స్వామి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈటివిలో ప్రసారమవుతున్న 'మీనాక్షి' సీరియల్ తో బాగా ఫేమస్ అయ్యారు ఈ నటి. మా టీవి లోనూ 'ఆమె కథ' అనే సీరియల్ లో లీడ్ రోల్ చేసి మరింత క్రేజ్ పెంచుకుంది. సోషల్ మీడియా లోనూ ఈ అమ్మడి జోరు మామూలుగా లేదు. భారీ స్థాయిలో అభిమానులు ఉన్నారు. అయితే తాజాగా ఈమెకు సంబందించిన ఒక వార్త టాలీవుడ్ ఇండస్ట్రీ లో సంచలనంగా మారింది. ఈ అమ్మడికి అదృష్టం అయస్కాంతం పట్టినట్టు పట్టుకుంది అంటూ వార్తలు హోరెత్తుతున్నాయి. ఓ స్టార్ హీరో చిత్రంలో అవకాశం కొట్టేసింది అంటూ టాక్.

అదేంటి ఒక సీరియల్ నటి స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ దక్కించుకోవడం ఏమిటి? అంటూ అందరూ అనుకుంటున్నారు. అయితే ఇక్కడ నటి ఎవరు అనేది కాదు, టాలెంట్, అందం మరియు ప్రజల్లో క్రేజ్ ఉంటే చాలు ఎవ్వరైనా సినిమా ఇండస్ట్రీలో రాణించ వచ్చు. అయితే ఆ స్టార్ ఎవరా అని మీ అనుమానమా? అతగాడు ఎవరో కాదు. పాత్రల ప్రయోగంలో ఎప్పటి కప్పుడు కొత్తగా ఆలోచిస్తూ ప్రజల గుండెల్లో తన స్థానాన్ని మరింత పెంచుకుంటూ దూసుకు వెళ్తున్న ఆ స్టార్ మరెవరో కాదు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఇప్పుడు పుష్ప సినిమా ఇచ్చిన విజయాన్ని ఎంజాయ్ చేస్తూనే పుష్ప పార్ట్ 2 ను తెరకెక్కిస్తున్నారు.

ఈ సినిమాలో ఒక పాత్రకు నవ్య స్వామిని ఎంపిక అయినట్లు వార్తలు వినపడుతున్నాయి. ఇది కరెక్టేనా... చిన్న పాత్ర లేక పెద్ద పాత్ర అన్న వివరాలు తెలియాల్సి ఉన్నాయి. ఏదేమైనా పుష్ప లాంటి అగ్ర హీరో చిత్రంలో అందు లోనూ పాన్ ఇండియా మూవీలో సీరియల్ హీరోయిన్ కి అవకాశం రావడం అంటే టాలెంట్ చాలానే ఉండాలి... అలాగే రాసి పెట్టుండాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: