టాలీవుడ్ లో అప్పుడెప్పుడో కాళిదాసు సినిమాతో ఇండస్ట్రీ హీరోగా పరిచయమయ్యాడు అక్కినేని మేనల్లుడు సుశాంత్. ఇతనికి అక్కినేని బ్యాగ్రౌండ్ ఉండటంతో ఈజీగానే ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చాడు. కానీ ఇప్పటివరకు హీరోగా మాత్రం తగినంత గుర్తింపు రాలేదు. ఆ గుర్తింపు కోసం  ఇంకా ఈ హీరో పాకులాడుతూనే ఉన్నాడు. కాళిదాసు తర్వాత వచ్చిన కరెంట్ సినిమా బాగానే ఆడినప్పటికీ స్టార్ స్టేటస్ మాత్రం అందుకోలేకపోయాడు సుశాంత్. ఇక కరెంటు తర్వాత అడ్డా, ఆటాడుకుందాం రా వంటి సినిమాలు చేసినా అవి ఎప్పుడు వచ్చాయో ఎప్పుడు వెళ్ళాయో కూడా ఆడియన్స్ కి తెలీదు. దీంతో కాస్త రూటు మార్చి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురం లో సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేశాడు.

త్రివిక్రమ్, అల్లు అర్జున్ వంటి  అగ్రతారలు ఉండడంతో ఆ సినిమాలో నటించడానికి ఒప్పుకున్నాడు. ఇక ఆ తర్వాత గత ఏడాది సుశాంత్ హీరోగా నటించిన ఇచ్చట వాహనములు నిలుపరాదు సినిమా విడుదలైంది. దర్శన్ అనే కొత్త దర్శకుడు తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద నిలవలేకపోయింది. నిజానికి చాలా ఏళ్ళపాటు గ్యాప్ తర్వాత ఈ సినిమా చేశాడు సుశాంత్. ఈ సినిమాకోసం సుశాంత్ బాగానే మేకోవర్ అయ్యాడు. అయితే ఎన్నో ఆశలు పెట్టుకున్నా ఇచ్చట వాహనములు నిలుపరాదు సినిమా ఫలితం చూసిన తర్వాత సుశాంత్ ఓ కీలకమైన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇకపై హీరోగా నటించి అనవసరంగా ఇబ్బంది పడటం కంటే..

 క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఫిక్స్ అయి పోవడం మంచిదని సుశాంత్ నిర్ణయించుకున్నట్లు స్పష్టమవుతోంది. అందుకోసమే ఇప్పుడు మాస్ మహారాజా రవితేజ సినిమాలో సపోర్టింగ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తున్నాడుసుధీర్ వర్మ దర్శకత్వంలో రవితేజ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'రావణాసుర' సినిమాలో రామ్ అనే పాత్రలో నటిస్తున్నాడు సుశాంత్. ఇటీవలే ఈ సినిమా నుంచి సుశాంత్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని చిత్ర యూనిట్ విడుదల చేయగా.. ఆ పోస్టర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక తాజాగా సుశాంత్ ఈ సినిమాకు సంబంధించి మొదటి రోజు షూటింగ్ లో పాల్గొన్నాడు. అందుకు సంబంధించిన ఫోటోలు తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి రావణాసుర సినిమా తర్వాత సుశాంత్ కెరీర్ ఎలా ఉండబోతుందో చూడాలి...!!

మరింత సమాచారం తెలుసుకోండి: