ఉప్పెన సినిమా తన క్రేజ్ ను మొదలుపెట్టి తాజాగా బంగార్రాజు అనే మూవీ తో కూడా బ్యాక్ టూ బ్యాక్ హీట్ సినిమాలను సంపాదించుకుంది. ఇక ఈ ముద్దుగుమ్మ మాయలో ఎంతోమంది కుర్రకారు పడిపోయారని చెప్పవచ్చు.. శ్యామ్ సింగరాయ్ సినిమా లో కాస్త గ్లామర్ డోస్ పెంచినప్పటికీ.. బంగార్రాజు లో అచ్చం పల్లెటూరు అమ్మాయిల కనిపించింది. ఇక లంగాఓణీలో ఈమె అందచందాలు సినిమాకి హైలెట్ గా నిలిచాయి అని చెప్పవచ్చు. ఇక ఈమె డ్రెస్సింగ్ స్టైల్ ఎన్ని సార్లు చూసినా చూడాలనిపించే విధంగా ఉంటుంది. ప్రస్తుతం ఈమె ఒక కండిషన్ పెట్టుకుందట వాటి గురించి చూద్దాం.


ఈ ముద్దుగుమ్మ సినిమాలలోనే కాకుండా.. ఏదైనా సినిమా ఫంక్షన్లకు వచ్చిన, ఇంటర్వ్యూలకు వచ్చిన కాస్త పద్ధతిగానే వస్తూ ఉంటుంది.. అయితే ఈ ముద్దుగుమ్మ ఎక్స్ పోజింగ్ కు కాస్త దూరంగా ఉంటానని కూడా తెలియజేస్తోంది. బోల్డ్ క్యారెక్టర్స్..ఎక్స్ పోజింగ్ గల డ్రస్సులు వేయనని చాలా కండీషన్స్ పెట్టుకున్నానని తెలియజేసింది..సినిమా ఒప్పుకునేటప్పుడు ముందుగానే చెప్పేస్తానని తెలియజేసింది.. అంతేకాకుండా కాస్ట్యూమ్స్ విషయంలో కూడా తనకు బాగా కంఫర్ట్ అనిపిస్తేనే ఆ సినిమాకు ఒప్పుకుంటానని తెలియజేసింది. అందుచేతనే నేను బోల్డ్ క్యారెక్టర్లు ఒప్పుకోను.. అవి నాకు చాలా అన్ కంఫర్టబుల్గా ఉంటాయని తెలియజేసింది. నేను చిన్న వయసులోనే ఇండస్ట్రీ లోకి వచ్చాను.. నా కంఫర్ట్ ను బట్టి నా కాస్ట్యూమ్స్ ను మారుస్తూ ఉంటానని తెలియజేసింది.

కథలు వినేటప్పుడు కూడా తన అమ్మతో కలిసి వింటానని తెలియజేసింది.. తామిద్దరూ ఓకే అంటేనే ఆ సినిమాని ఒప్పుకుంటానని తెలిపింది. ఇంతవరకు  ఎలాంటి ఇబ్బంది పడలేదు అని తెలియజేశారు. ఇక అంతే కాకుండా సినిమా స్టోరీ విన్న తర్వాత ఆ పాత్రకు తగ్గట్టుగా ఎలా చేయాలి ఇంట్లో వర్కౌట్స్ చేస్తూ ఉంటాను అని చెప్పుకొచ్చింది.. ఏది ఏమైనా ఈమే తో సినిమా తీయాలంటే చాలా ఇబ్బందులు పడాల్సి ఉంటుంది డైరెక్టర్లు.. అని చెప్పవచ్చు

మరింత సమాచారం తెలుసుకోండి: