చాలా మంది తారలు ప్రస్తుతం సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌లు కూడా చేస్తున్నారు.ఈ క్రమంలోనే పలు ప్రొడక్ట్స్‌కు బ్రాండ్ అంబాసిడర్స్‌గా వ్యవహరిస్తూ రెండు చేతులా వారు సంపాదిస్తున్నారు. తమ బ్రాండ్ వాల్యూను పెంచుకోవడంతో పాటు కార్పొరేట్ కంపెనీల రెవెన్యూ పెంచే ప్రయత్నాలూ కూడా వారు చేస్తున్నారు. అలా తమకు కూడా అవకాశాలు వచ్చినప్పటికీ ఈ సినీ తారలు మాత్రం తమకు ఆ అవసరం లేదని అంటున్నారట  ఎన్ని కోట్ల రూపాయలు ఇచ్చినా తాము యాడ్స్‌లో నటించబోమని చెప్తున్నారట.. వారు ఎవరెవరంటే.

టాలీవుడ్ సీనియర్ హీరో అయిన నటసింహం నందమూరి బాలకృష్ణ ఇప్పటి వరకు ఒక్క కమర్షియల్ యాడ్ లో కూడా నటించలేదు. జనాలకు ఉపయోగపడే యాడ్స్ లో మాత్రమే తాను నటిస్తానని బాలయ్య చెప్పారట.మరో సీనియర్ హీరో అయిన డైలాగ్ కింగ్ మోహన్ బాబు.. యాడ్స్‌లో నటించేందుకుగాను నో చెప్పాడట.తాను యాడ్స్ లో అస్సలు నటించబోనని అన్నాడట. చాలా కాలం కిందట కొందరు కార్పొరేట్ కంపెనీల ప్రతినిధులు రిక్వెస్ట్ చేసినప్పటికీ ఆయన నో చెప్పారని తెలుస్తుంది.నందమూరి వారి హీరో కల్యాణ్ రామ్ కూడా యాడ్స్‌లో నటించకూడదని నిర్ణయించుకున్నారట.


సీనియర్ హీరోయిన్ గౌతమి సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ అయిన ఈమె కూడా కమర్షియల్ యాడ్స్ లో నటించడానికి నో చెప్పిందట.. సహజ నటిగా పేరుగాంచిన వర్ధమాన హీరోయిన్ సాయిపల్లవి కూడా యాడ్స్ కు నో చెప్పిందని సమాచారం.సినిమాల్లో సహజ నటనకు ప్రాధాన్యత నిస్తుంది ఈ భామ ఇటీవల ఆమెను ఫెయిర్ నెస్ క్రీమ్ వాళ్లు యాడ్ చేయాలని కోరగా, అందుకు ఆమె నో చెప్పిందని తెలుస్తుంది.మంచు మోహన్ బాబు తనయులు విష్ణు అలాగే మనోజ్ లు కూడా యాడ్స్ కు నో చెప్పారట.'అల్లరి' నరేశ్ కూడా కమర్షియల్ యాడ్స్ చేసేందుకుగాను నిరాకరించాడట.మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కూడా కమర్షియల్ యాడ్స్ కు నో చెప్పాడని ఇకపోతే ఈ తారలు జనాలకు అవసరమయ్యే యాడ్స్ జన హితం కోసం చేస్తే మాత్రం తప్పకుండా అందులో నటిస్తామని చెప్తుండటం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: