ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానెల్ లో వచ్చే జబర్దస్త్ కామెడీ షో తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు బాగా ఎక్కేసిందని చెప్పొచ్చు. ఎమిది ఏళ్లుగా అప్రతిహతంగా ఆ షో కొనసాగుతుంది. ఆ షోలో వచ్చిన కమెడియన్స్ కి స్ట్రాంగ్ కెరియర్ బిల్డ్ అయ్యింది. స్మాల్ స్క్రీన్ కామెడీ షో జబర్దస్త్ షోని కొట్టడానికి చాలా షోలు వచ్చాయి. కానీ ఎవరి వల్లా కాలేదు. స్టార్ మా మాత్రం ఎలాగైనా జబర్దస్త్ షోని బీట్ చేయాలనే ఉద్దేశంతో రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. స్టార్ మాలో కామెడీ స్టార్స్ అనే ఎపిసోడ్ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తుంది.

ఈ షోని ఎలాగైనా జబర్దస్త్ కి పోటీగా నిలబెట్టాలని ప్రయ్త్నిస్తున్నారు. కామెడీ స్టార్స్ గా ఉన్న ఈ షో కాస్త ఇప్పుడు కామెడీ స్టార్స్ ధమాకా అని మార్చారు. జబర్దస్త్ సెంటిమెంట్ ని కొనసాగించేలా మెగా బ్రదర్ నాగబాబుని ఈ షోలో జడ్జ్ గా పెట్టారు. మరో జడ్జ్ గా శేఖర్ మాస్టర్ చేస్తూ వస్తున్నారు. అంతకుముందు కామెడీ స్టార్స్ గా ఉన్న ఈ ఎపిసోడ్ ని.. ఇప్పుడ్డు కామెడీ స్టార్స్ ధమాకాగా రెట్టింపు ఎనర్జీతో వస్తున్నారు. ఈ షోకి యాంకర్ గా దీపిక పిల్లి చేస్తుంది.

అంతేకాదు జబర్దస్త్ లో నిరాశా పరులను ఈ షోలోకి ఆహ్వానించారు. ఈ క్రమంలో జబర్దస్త్ లో ఎప్పటి నుండో చేస్తున్న అదిరే అభి.. జీవన్.. సత్తిపండు కూడా అక్కడ మానేసి ఇక్కడ జాయిన్ అయ్యారు. ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసేందుకే ఈ షోలు అనుకున్నా వీళ్లు మాత్రం ఒకరిపై ఒకరు పై చేయి సాధించాలని ప్రయత్నిస్తున్నారు. జబర్దస్త్ షో లైవ్ చూసే వారి కన్నా యూట్యూబ్ లో ఎక్కువమంది చూస్తారు. కానీ కామెడీ స్టార్స్ కి ఎలాంటి వెసులుబాటు లేదు. అది చూడాలంటె డిస్నీ హాట్ స్టార్ లో చూడాలి. దాని సబ్ స్క్రిప్షన్ తీసుకోవాలి. అందుకే ఈ షోకి రిపీటెడ్ ఆడియెన్స్ ఉండటం లేదు.  


మరింత సమాచారం తెలుసుకోండి: