ప్రభాస్‌ హీరోగా కేజీఎఫ్‌ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న సలార్‌ సినిమా గురించి గత ఏడాది కాలం గా ఏదో ఒక వార్త మాత్రం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంది.

అయితే ఈమద్య కాలంలో ఒక వార్త అందరి దృష్టిని తెగ ఆకర్షిస్తోందట. ప్రశాంత్ నీల్‌ సలార్‌ సినిమా ను రెండు పార్ట్‌ లుగా విడుదల చేసేందుకు ఏర్పాట్లు కూడా చేస్తున్నాడు. రెండు పార్ట్‌ లకు కూడా ఒకే సారి షూటింగ్ ను జరుపుతున్నాడు.. రెండు పార్ట్‌ లను కూడా మూడు లేదా నాలుగు నెలల గ్యాప్ లో విడుదల చేయబోతున్నారు అంటూ పెద్ద ఎత్తున మీడియా లో వార్తలు అయితే వచ్చాయి. ఆయన గత చిత్రం కేజీఎఫ్‌ కూడా రెండు పార్ట్‌ లు గా వచ్చింది అలాగే ప్రభాస్ ఇంతకు ముందు సినిమా బాహుబలి కూడా రెండు పార్ట్‌ లుగా వచ్చింది. తాజాగా పుష్ప సినిమా రెండు పార్ట్‌ లు.. రెండు పార్ట్‌ లు అనేది ఈమద్య కాలంలో సక్సెస్ ఫార్ముల అయ్యిందట.

అందుకే సలార్‌ ను కూడా రెండు పార్ట్‌ లు గా విడుదల చేయడం ద్వారా మంచి లాభాలను దక్కించుకోవచ్చు అనేది ప్రశాంత్ నీల్ ప్లాన్ అంటూ ఒక ప్రముఖ మీడియా సంస్థ కూడా తన కథనంలో పేర్కొన్నట్లు సమాచారం.. ఆ విషయమై దర్శకుడు ప్రశాంత్‌ నీల్ నుండి కన్నడ మీడియా వర్గాల వారు క్లారిటీ తీసుకునే ప్రయత్నం కూడా చేశారు. సలార్‌ సినిమా ను రెండు పార్ట్‌ లు గా చేస్తున్నట్లుగా వస్తున్న వార్తల్లో ఏమాత్రం కూడా నిజం లేదని ఆయన కన్నడ జర్నలిస్ట్‌ కు ఫోన్ ద్వారా తెలియజేశాడట.

ప్రశాంత్‌ నీల్ తనతో సలార్‌ రెండు పార్ట్‌ ల విషయాన్ని క్లారిటీ ఇచ్చాడంటూ ఆ కన్నడ జర్నలిస్ట్‌ సోషల్‌ మీడియా ద్వారా తెలియజేశాడట.మీడియాలో జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవం ఎవరు కూడా దాన్ని అస్సలు నమ్మవద్దు. ప్రభాస్ అభిమానులు సలార్‌ గురించి వచ్చిన వార్తలతో గందరగోళంకు గురి అయ్యారని తాజాగా క్లారిటీ రావడంతో ఊపిరి పీల్చుకుంటున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: