ప్రస్తుతం ఎక్కడ చూసినా ఆ సినిమా గురించే చర్చ జరుగుతోంది. అదిగో విడుదలవుతుంది ఇదిగో విడుదల అవుతుంది అని అభిమానులు ఆశలు పెట్టుకోవడం తప్ప.. సినిమా విడుదలయ్యింది లేదు ప్రేక్షకులను అలరించింది లేదు. దాదాపు ప్రేక్షకులకు నిరాశ తప్పడం లేదు. ఇలా ప్రేక్షకులను నిరాశపరుస్తూన్న సినిమా ఏదో కాదు దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన త్రిబుల్ ఆర్ సినిమా. ఈసారి తప్పకుండా జనవరి 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తానంటూ జక్కన్న చెప్పారు. ఇక ఇది నిజమే కావచ్చు అంటూ మిగతా సినిమాల దర్శక నిర్మాతలు కూడా తమ సినిమాలను వాయిదా వేసుకున్నారు.


 ఇక ఇద్దరు హీరోల అభిమానులు కూడా పెద్ద పెద్ద బ్యానర్లు ఏర్పాటు చేయడానికి అంతా సిద్ధం చేసుకున్నారు. మరికొన్ని రోజుల్లో సినిమా విడుదలవుతుంది అనుకుంటున్న సమయంలో ఈ సినిమాను వాయిదా వేస్తున్నాం అంటూ ట్విస్ట్ ఇచ్చింది త్రిబుల్ ఆర్ చిత్రబృందం. మళ్లీ అభిమానులకు నిరాశే ఎదురైంది. తర్వాత సినిమా ఎప్పుడు విడుదలవుతుందా అనుకుంటున్న సమయంలో మార్చి 18, 28 తేదీలలో విడుదల చేస్తామంటూ 2 రిలీజ్ డేట్స్ ప్రకటించి అందరిని కన్ఫ్యూషన్ లో  పడేసింది. ఇక చివరికి మార్చి 25 వ తేదీన విడుదల చేస్తామంటూ కన్ఫామ్ చేసింది జక్కన్న బృందం.



 ఈసారి మాత్రం తప్పకుండా విడుదల చేస్తారు అని అభిమానులు కూడా ఫిక్స్ అయ్యారు. ఇక మార్చి 25 వ తేదీన విడుదల చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో ఇక అభిమానులు అందరూ రోజులు లెక్క పెట్టుకుంటున్నారు. ఇక ఈ రోజుతో  నుండి చూస్తే ఇంకా త్రిబుల్ ఆర్ సినిమా విడుదల కావడానికి 50 రోజులు గడవాల్సి ఉంది.  హమ్మయ్య ఇంకా త్రిబుల్ ఆర్ సినిమా విడుదలకు 50 రోజుల సమయం మాత్రమే ఉందని.. ఇక రచ్చ చేయడం పక్క అని అభిమానులు కొంతమంది సంతోష పడుతూ ఉంటే.. వామ్మో ఇంక 50 రోజులు వేచి చూడాలా మా వల్ల కాదు అంటూ ఇంకొంత మంది అభిమానులు డీలా పడిపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Rrr