సినిమా లో నటీనటులు ఎవరో తెలియకపోయినప్పటికీ.. దర్శక నిర్మాతలు పేరు కూడా గుర్తు లేకపోయినప్పటికీ హాలీవుడ్ సినిమాలను తెగ ఆదరిస్తూ ఉంటారు ఇండియన్ ప్రేక్షకులు. హాలీవుడ్ సినిమాలలో ఉండే యాక్షన్ సన్నివేశాలు భారత ప్రేక్షకులందరినీ కూడా అబ్బురపరుస్తు ఉంటాయి అని చెప్పాలి. హాలీవుడ్ సినిమాలలో అటు స్పైడర్ మాన్ సిరీస్ కి ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. ఇప్పుడు వరకు స్పైడర్ మాన్ సినిమాలు ఎన్నో వచ్చిన భారత్ లో సూపర్ హిట్ సాధించాయి అని చెప్పాలి.. ఇక ఇటీవల స్పైడర్ మాన్ న్యూనో వే హోమ్ అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ అయింది. సినిమాలో స్పైడర్ మాన్ పాత్రలో టామ్ హాలండ్ నటించాడు.
స్పైడర్ మాన్ తో ప్రేక్షకులను అలరించి హిట్ కొట్టిన టామ్ ఇప్పుడు అన్ చార్టెడ్ అనే ఒక వైవిధ్యమైన సినిమాలో నటిస్తున్నాడు. ఇక ఈ మూవీ కోసం ఏ హీరో చేయని సాహసాలు చేస్తున్నాడు టామ్. అన్ చార్టెడ్ సినిమాలో ఒక కీలకమైన యాక్షన్ సన్నివేశం కోసం ఏకంగా 17 సార్లు కారుతో అతను గుద్దించుకోవాల్సిన పరిస్థితి వచ్చిందట. ఇక ఇలాంటివి రిస్క్ షాట్ ని కూడా ఎక్కడా వెనకడుగు వేయకుండా చేశాడట హీరో. వీడియో గేమ్ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఫిబ్రవరి 18న థియేటర్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి