ప్రస్తుతం విడుదలకు సిద్ధంగా ఉండి ప్రేక్షకుల్లో మంచి అంచనాలు కలిగిఉన్న సినిమాలలో ఖిలాడి సినిమా ఒకటి, ఈ సినిమాలో మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించగా ఈ సినిమాకు రమేష్ వర్మ దర్శకత్వం వహించాడు. ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు కూడా ఈ సినిమాలో డింపుల్ హయాతి, చౌదరి హీరోయిన్ గా నటించగా దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతన్ని సమకూర్చాడు. ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీ భాషల్లో కూడా విడుదల చేయబోతున్నారు, ఈ సినిమాను ఫిబ్రవరి 11 వ తేదీన థియేటర్ లలో విడుదల చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో ఖిలాడి సినిమా గురించి మీనాక్షి చౌదరి మాట్లాడింది... ఇప్పటికే మీనాక్షి చౌదరి,  సుశాంత్ హీరోగా తెరకెక్కిన ఇచ్చట వాహనాలు నిలుపరాదు సినిమాలో హీరోయిన్ గా నటించింది, ఈ సినిమా పర్వాలేదు అని రిజల్ట్ ను తెచ్చుకుంది.  తాజాగా ఖిలాడి సినిమా గురించి మీనాక్షి చౌదరి మాట్లాడుతూ... నా రెండవ మూవీనే రవితేజ గారితో కలిసి చేస్తానని అనుకోలేదు, రవితేజ టైమింగ్ మామూలుగా లేదు. తెలుగు అంతగా రాకపోవడం వలన కాస్త నేను ఇబ్బంది పడ్డాను, కానీ కంగారు పడొద్దంటూ రవితేజ కంఫర్టును ఇచ్చారు. అందువల్లనే నా  పాత్రను నేను సరిగ్గా చేయగలిగాను, ఈ మూవీ లో  లిప్ లాక్ ఉంది .. కథకు అవసరం కనుకనే అలా చేసాను అని మీనాక్షి చౌదరి తెలియజేసింది,  ఇక డింపుల్ హయాతి తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం ఆనందంగా ఉంది, ఆమెకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్  చాలా ఎక్కువ అనే విషయాన్ని నేను గమనించాను. ఈ మూవీ కోసం కోసం చాలామంది సీనియర్ ఆర్టిస్టులు పనిచేశారు, తప్పకుండా ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందనే నమ్మకం ఉంది. తెలుగులో చేసిన 'హిట్ 2' సినిమా , తమిళంలో చేసిన 'కొలై' సినిమా రిలీజ్ కి రెడీగా ఉన్నాయి అది మీనాక్షి చౌదరి చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: