హాట్ బ్యూటీ కియారా అద్వాని బాలీవుడ్ సినిమాలతో ఎంట్రీ ఇచ్చి అక్కడ ఫుల్ క్రేజ్ ని సంపాదించుకొని టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోల సరసన నటించి ఇక్కడ కూడా అదిరిపోయే క్రేజ్ ను సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం బాలీవుడ్ లో  ఫుల్ క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది,  బాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న కియారా అద్వానీ టాలీవుడ్ ఇండస్ట్రీలో భరత్ అనే నేను,  వినయ విధేయ రామ సినిమాలలో నటించి  తెలుగునాట కూడా ఫుల్ క్రేజ్ ను సంపాదించుకుంది.

  ఆ తర్వాత ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ ఇండస్ట్రీలో కంటిన్యూ అవుతుంది అని చాలా మంది అనుకున్నారు,  కాకపోతే కియారా అద్వాని బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ నుండి క్రేజీ సినిమా అవకాశాలు తక్కడంతో ఈ ముద్దుగుమ్మ మళ్లీ బాలీవుడ్ ఇండస్ట్రీ వైపు అడుగులు వేసింది.  అందులో భాగంగా ఈ ముద్దుగుమ్మ నటించిన అనేక బాలీవుడ్ సినిమాలు మంచి సక్సెస్ ను సాధించాయి,  ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది,  ఈ సినిమాకు శంకర్ దర్శకత్వం వహిస్తుండగా దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు,  ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది.  ఇప్పటికే కీయారా అద్వానీ,  రామ్ చరణ్ సరసన 'వినయ విధేయ రామ'  సినిమాలో హీరోయిన్ గా నటించింది,  వీరిద్దరి కాంబినేషన్ లో ఇది రెండవ సినిమా, ఇలా ఇప్పటికే టాలీవుడ్ ఇండస్ట్రీ లో క్రేజ్ ను సంపాదించుకున్న ఈ హీరోయిన్ మరో క్రేజీ సినిమా అవకాశాన్ని దక్కించుకున్న వార్తలు వస్తున్నాయి.  విజయ్ దేవరకొండ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కబోతుంది అంటూ గత కొన్ని రోజులుగా అనేక వార్తలు బయటకు వస్తున్నాయి,  విజయ్ దేవరకొండ, శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలో కియారా అద్వాని ని హీరోయిన్ గా తీసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి,  ఈ వార్తకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: