మలయాళంలో "అయ్యప్పనుం కోషియం" మూవీ ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో తెలిసిందే. అందుకే ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయడానికి టాలీవుడ్ నిర్మాతలు అయిన చినబాబు మరియు సూర్యదేవర నాగవంశీ రీమేక్ రైట్స్ ను సొంతం చేసుకున్నారు. అలా ఈ సినిమాకు బీజం పడింది. అప్పటి నుండి ఈ రోజు సినిమా థియేటర్ లో విడుదల అయ్యే వరకు దీని గురించి సోషల్ మీడియాలో ఏదో ఒక చర్చ జరుగుతూనే ఉంది. ఈ సినిమా టైటిల్ భీమ్లా నాయక్ అని ప్రకటించిన నాటి నుండి మొన్న జరిగిన ప్రి రిలీజ్ వేడుక వరకు ప్రేక్షకులు ఈ సినిమా రిలీజ్ కోసం ఎంతగానో వెయిట్ చేశారు. అయితే ఆ క్షణం రానే వచ్చింది.

ఈ రోజు ఎన్నో అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఈ చిత్రం అంచనాలను అందుకుని ఒక మంచి చిత్రంగా నిలవనుంది అని మాత్రం తెలుస్తోంది. ఈ సినిమాకు దర్శకుడిగా సాగర్ కె చంద్ర వ్యవహరించినా, మరో సీనియర్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ అడుగడుగునా అతడికి అండగా ఉంటూ సినిమాను సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేయడంలో హెల్ప్ చేశాడు. ఈ సినిమా ఒరిజినల్ లో కథను పవన్ కళ్యాణ్ కు తగినట్లుగా మార్చుకుంటూ మంచి ఫలితాన్ని పొందాడు అని చెప్పాలి. అయితే ఓవరాల్ గా చూసుకుంటే సినిమాలో పవన్ మరియు రానాల మధ్యన వచ్చే సన్నివేశాలు వారి డైలాగ్ లు ప్రధాన ఆకర్షణ అని తెలుస్తోంది.

త్రివిక్రమ్ అందించిన డైలాగ్స్ సినిమాను వేరే లెవెల్ కి తీసుకెళ్ళాయి. అంతే కాకుండా సినిమాకు కీలకం అయినా స్క్రీన్ ప్లే విషయంలోనూ త్రివిక్రమ్ తన అనుభవాన్ని అంతా రంగరించి తీర్చిదిద్దాడు. అలా ఈ సినిమాకు త్రివిక్రమ్ ప్రాణం పోశాడు అని చెప్పాలి. ఈ సినిమాకు త్రివిక్రమ్ ను ఎవరూ ఎంచుకున్నారో తెలియదు కానీ అందుకు పూర్తి న్యాయం చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: