పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా నటించిన 'భీమ్లా నాయక్' బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకోగా..ఈ సినిమా సక్సెస్ తో పవన్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ.ఇకపోతే  ఓపెనింగ్స్ కూడా భారీగా దక్కడంతో మేకర్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పవన్ భీమ్లా నాయక్ కి నేటి నుండి అసలు పరీక్ష మొదలుకానుంది. అయితే భారీగా అడ్వాన్స్ బుకింగ్స్ దక్కించుకున్న భీమ్లా నాయక్ వీకెండ్ వరకు ఢోకా లేకుండా వసూళ్లు సాధించింది. కాగా వీకెండ్ ముగియడంతో భీమ్లా నాయక్ ఎంత వరకు ఆడియన్స్ ని థియేటర్స్ వద్దకు రప్పించగలడు అనేది చూడాలి. ఇకపోతే నైజాం లో భీమ్లా నాయక్ ఆల్ టైం రికార్డు నమోదు చేసింది.ఇదిలా ఉంటె పవన్ మరో రీమేక్ చేయడానికి సిద్దమయ్యారనేది లేటెస్ట్ టాక్.ఈయన అట్లీ దర్సకత్వంలో విజయ్ హీరోగా 2016లో విడుదలైన చిత్రం తేరి.

ఈ సినిమాలో సమంత, అమీ జాక్సన్ హీరోయిన్స్ నటించిన తేరి చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. అయితే తెలుగులో పోలీసోడు పేరుతో అందుబాటులోకి వచ్చింది ఈ చిత్రం. ఇక తేరీ చిత్రాన్ని పవన్ రీమేక్ చేయనున్నారట. అయితే ఈ రీమేక్ కి సాహో ఫేమ్ సుజీత్ దర్శకత్వం వహించనున్నారట. ఇకపోతే ఆర్ ఆర్ ఆర్ నిర్మాత డివివి దానయ్య ఈ చిత్రాన్ని భారీ ఎత్తున తెరకెక్కించనున్నారట.అంతేకాదు  ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన చర్చలు కూడా ముగిశాయనేది టాలీవుడ్ వర్గాల బోగట్టా. ఈ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చిన నేపథ్యంలో మరోసారి పవన్ ని పవర్ ఫుల్ పోలీస్ గా చూసే అవకాశం ఫ్యాన్స్ కి దక్కినట్లే.అయితే  మరోవైపు పోలీస్ కథల రీమేక్స్ పవన్ కి బాగా కలిసొస్తున్నాయి. ఇకపోతే దబాంగ్ రీమేక్ గబ్బర్ సింగ్, అయ్యప్పనుమ్ కోశియుమ్ రీమేక్ భీమ్లా నాయక్ పాజిటివ్ ఫలితాలు ఇచ్చాయి.

అంతేకాకుండా విజయ్ చిత్రాలకు తెలుగులో ఆదరణ పెరగడంతో తేరి డబ్బింగ్ వర్షన్ పోలీసోడు చాలా మంది చూశారు.అయితే అందరికీ పరిచయమైన చిత్రాన్ని మరలా పవన్ తీస్తారా లేదా అనేది ఒక సందేహం.ప్రస్తుతం అధికారికంగా పవన్ మూడు చిత్రాలు పూర్తి చేయాల్సి ఉంది. అయితే తమిళ్ రీమేక్ తో పాటు, తేరి రీమేక్ ప్రచారంలో ఉన్న ప్రాజెక్ట్స్.ఇక ఈ రెండింటిపై ప్రకటన రావాల్సి ఉంది. అంతేకాదు హరి హరి హర వీరమల్లు ఈ ఏడాది విడుదల కానుంది. దఇకపోతే ర్శకుడు క్రిష్ పీరియాడిక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా దీన్ని తెరకెక్కిస్తున్నారు. కాగా నిధి అగర్వాల్, జాక్విలిన్ పెర్నాండెజ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: