డెబ్యూ మూవీ ఉప్పెన తో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న దర్శకుడు బుచ్చి బాబు సన,   ఆ సినిమా తర్వాత స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో జూనియర్ ఎన్టీఆర్ హీరో గా ఒక మూవీ ని తెరకెక్కించబోతున్నాడు అని చాలా రోజుల నుండి ఒక వార్త వైరల్ అవుతున్న విషయం మనందరికీ తెలిసిందే,  అయితే ఆ వార్తల తర్వాత ఎన్టీఆర్,  కొరటాల శివ దర్శకత్వం లో తెరకెక్కబోయే మూవీ లో నటించబోతున్నట్లు వార్తలు రావడంతో ఎన్టీఆర్,  బుచ్చి బాబు సన కాంబినేషన్ లో సినిమా ఇప్పట్లో  కష్టమే అని కూడా కొన్ని రోజుల క్రితం వార్తలు వచ్చాయి.  ఇది ఇలా ఉంటే తాజాగా మరో సారి జూనియర్ ఎన్టీఆర్, బుచ్చి బాబు సన మూవీ కి సంబంధించిన వార్త నెట్టింట్లో వైరల్ అవుతుంది, ప్రస్తుతం వస్తున్న వార్తల ప్రకారం జూనియర్ ఎన్టీఆర్, బుచ్చి బాబు సన  కాంబినేషన్ లో సినిమా సెట్ అయింది అంటూ, movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ వారు ఈ సినిమాను పర్ఫెక్ట్ గా సెట్ చేశారు అంటూ ఒక వార్త ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతుంది.

మూవీ కి సంబంధించిన అఫీషియల్ ప్రకటన ఏప్రిల్ 11 వ తేదీన రాబోతుంది అంటూ కూడా ఒక వార్త వైరల్ అవుతుంది, ఏప్రిల్ 11 వ తేదీన ఈ మూవీ కి సంబంధించిన అధికారిక సమాచారం తో పాటు మిగతా వివరాలు తెలిసే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.  ప్రస్తుతం ఎన్టీఆర్ 'ఆర్ఆర్ఆర్' సినిమాలో హీరోగా నటించాడు,  ఈ సినిమా మార్చి 25 వ తేదిన విడుదల కాబోతుంది,  ఈ సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కే ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ నటించబోతున్నాడు, జూనియర్ ఎన్టీఆర్,  కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న సినిమా పూర్తి అయిన తర్వాత బుచ్చిబాబు సన దర్శకత్వంలో తెరకెక్కే  సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: