ప్రస్తుతం మన టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న హీరోలు చాలామంది తమ ఇమేజ్ ను పక్కన పెట్టేసి ఇతర హీరోల సినిమాల్లో గెస్ట్ రోల్స్ చేయడానికి ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. స్టార్ హీరోలు సైతం ఇందుకు అతీతం కాదు. ఇప్పటికే కొంతమంది అగ్ర హీరోలు భారీ మల్టీస్టారర్ సినిమాలు చేయడానికి ఒప్పుకుంటున్నారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ మెగాస్టార్ చిరంజీవి సినిమాలో ఒక ప్రత్యేక పాత్రలో నటించేందుకు రెడీ అయ్యారు. బాబీ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి 154వ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి కి తమ్ముడి పాత్రలో రవితేజ కనిపించనున్నాడట.

సుమారు 22 సంవత్సరాల క్రితం వచ్చిన అన్నయ్య సినిమా లో చిరంజీవి కి సోదరుడి పాత్రలో రవితేజ నటించిన విషయం తెలిసిందే. ఇక మళ్లీ ఇన్నాళ్లకు మరోసారి చిరంజీవికి సోదరుడిగా అలరించబోతున్నాడు మాస్ మహారాజా. అంతేకాదు ఈ సినిమాలో రవితేజ పాత్ర చాలా కీలకం కానుందని.. సుమారు నలభై నిమిషాలు ఆ పాత్ర ఉంటుందని.ఇక ఆ పాత్ర మాస్ఆడియన్స్కి విపరీతంగా నచ్చిందని అంటున్నారు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కాబోతోంది. movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి కి జోడీగా శృతి హాసన్ హీరోయిన్గా నటిస్తోంది.

సినిమా కోసం శృతి హాసన్ భారీ రెమ్యునరేషన్ కూడా తీసుకుంటున్నట్లు సమాచారం. ఇక చిరంజీవి తో శ్రుతిహాసన్ నటించడం ఇదే మొదటిసారి. దీంతో ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి ఈ సినిమా ఆ అంచనాలను ఏమేరకు  అందుకుంటుందో చూడాలి. మరోవైపు చిరంజీవి తాజాగా నటించిన ఆచార్య సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కీలకపాత్ర పోషించిన ఈ సినిమా వేసవి కానుకగా ఏప్రిల్ 29 న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: