అంతేకాదు కమర్షియల్ హిట్ కాకపోయినప్పటికీ మంచి మెసేజ్ ఇచ్చిన సినిమాగా.. తెలియని విషయాలు తెలియజేసిన సినిమాగా ప్రేక్షకుల మన్ననలు పొందాయ్ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇటీవల ఇలాంటి యధార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన చిత్రం ది కాశ్మీర్ ఫైల్స్. 1990 లో జమ్మూ కాశ్మీర్ లో చోటుచేసుకున్న తిరుగుబాటు సమయంలో ఎలాంటి ఘర్షణలు చోటు చేసుకున్నాయి. దారుణ ఘటన నేపథ్యంలో ఎన్నో హిందూ కుటుంబాలు వలస.. హృదయవిదారక ఘటనలు అన్నింటినీ కూడా ఎలాంటి కమర్షియల్ హంగులు అద్దకుండా కళ్లకు కట్టినట్లుగా తెరకెక్కించిన చిత్రం ది కాశ్మీర్ ఫైల్స్.
ఇక ఈ సినిమా ప్రతి ప్రేక్షకుడి మనసుని కదిలిస్తుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇటీవలి హీరోయిన్ ప్రణిత ది కాశ్మీర్ ఫైల్స్ సినిమా చూసినట్లు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. ఈ సినిమాని ప్రతి ఒకరు చూడాలి అంటూ కోరింది. నేను నా భర్తతో కలిసి ది కాశ్మీర్ ఫైల్స్ సినిమా వీక్షించాను. ఈ సినిమా పూర్తయ్యే సరికి నేను నా భర్త ఏడ్చేసాం. సుమారు 30 సంవత్సరాల క్రితం కాశ్మీరి పండిట్స్ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు కళ్ళకు కట్టినట్లుగా చూపించారు అంటూ ప్రణీత ఈ సినిమా చూసిన తరువాత తన అనుభవాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి