ఉప్పెన సినిమాతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న ముద్దుగుమ్మ కృతి శెట్టి. చిన్న తనంలోనే పలు కంపెనీల యాడ్స్ లో నటించి అందరినీ ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. కర్ణాటక రాష్ట్రంలోని మంగుళూరులో జన్మించిన ఈమె తన తల్లి ప్రోత్సాహంతో మోడలింగ్ వైపు అడుగులు వేసింది. 2019లో సూపర్ 30 సినిమాలో ఓ చిన్న పాత్ర చేసే అవకాశం అందుకున్న ఈమె ఆ తర్వాత
వైష్ణవ్ తేజ్ సరసన నటించి భారీ స్థాయిలో గుర్తింపును సంపాదించుకుంది. బుచ్చిబాబు దర్శకత్వం వహించిన ఈ
సినిమా 100 కోట్ల వసూళ్లను సాధించిన
సినిమా గా తెలుగు ప్రేక్షకుల మనసును దోచుకుంది.
ఎవరి పరిస్తితి ఎలా ఉన్నా కూడా ఈ
సినిమా ద్వారా కృతి బాగానే లాభపడింది అని చెప్పవచ్చు. మొదటి మూవీతోనే ఇంతటి స్థాయి హిట్ ను తన ఖాతాలో వేసుకోవడం మాత్రమే కాకుండా ప్రేక్షకులను కూడా భారీ స్థాయిలో అలరించింది. ఆ విధంగా కృతి శెట్టి ఆ తర్వాత చేసిన సినిమాలు సైతం ఆమెకు మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకువచ్చాయి.
నాని సరసన చేసిన
శ్యామ్ సింగరాయ్ అలాగే నాగచైతన్యతో కలిసి తీసిన బంగార్రాజు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించి ఆమెకు ఎనలేని పేరును తీసుకువచ్చాయి.
ఆ విధంగా సినిమాలు సూపర్ హిట్ కావడంతో ఈమె అగ్ర హీరోల సరసన చేరిపోయింది. ప్రస్తుతం వరుస ఆఫర్లతో ఈ ముద్దుగుమ్మ దూసుకుపోతుంది.
సూర్య హీరోగా నటించబోయే ఈ సినిమాలో
హీరోయిన్ నటిస్తూ
కోలీవుడ్ లోకి కూడా అడుగు పెట్టబోతోంది కృతి.
సూర్య బాల దర్శకత్వం లో తన 41వ
సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాకి ఆమె ఎంపిక కావడం పెద్దగా ఆశ్చర్యం కాకపోయినా కూడా ఆమె డిమాండ్ చేస్తున్న పారితోషకాన్ని చూసి అందరూ ఆశ్చర్య పడుతున్నారు. ఏకంగా కోటినర రూపాయలు డిమాండ్ చేస్తూ ఉండడంతో నిర్మాతలు సైతం ఎంతో ఆశ్చర్యపోతున్నారు. కానీ ఆమెకు ఉన్న క్రేజ్ దృష్ట్యా ఇంత పారితోషికం ఇవ్వడానికి సిద్ధ పడిపోతున్నారు. తెలుగు సినిమాల విషయానికి వస్తే ఆమె
రామ్ తో కలిసి ది
వారియర్ అనే
సినిమా చేస్తుంది. ష్ మరియు నితిన్ హీరోగా నటిస్తున్న సినిమాలో కూడా హీరోయిన్గా చేస్తుంది త్వరలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.