పెళ్లి చూపులు సినిమాతో ఓ సాధారణ హీరోగా తెలుగు సినిమా పరిశ్రమకు పరిచయమయ్యాడు విజయ్ దేవరకొండ. ఆ సినిమా మొదలు పెట్టినప్పుడు విజయ్ దేవరకొండ అంటే ఎవరో కూడా ఎవరికీ పూర్తిగా తెలియదు. అలాంటి స్థాయి నుంచి ఇప్పుడు దేశం మొత్తం గుర్తించేలా సినిమాలు చేసి అగ్ర హీరోగా మారాడు. చాలామంది దర్శకులు పెద్ద నిర్మాతలు ఈ హీరో డేట్స్ కోసం ఎంతగానో వేచి చూస్తున్నారు. తనతో సినిమా చేయాలి అని వారు ఆయనకు రిక్వెస్ట్ మీద రిక్వెస్ట్ లు పెడుతున్నారు. ఈ విధంగా విజయ్ దేవరకొండ తెలుగు సినిమా పరిశ్రమలో చేసిన ప్రయాణం ఎంతో గొప్పది అని చెప్పవచ్చు.
ఏదైతేనేం ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమా పరిశ్రమకు వచ్చిన హీరోల జాబితాలో విజయ్ దేవరకొండ కూడా ఉన్నాడు. ఆ విధంగా ఈ తరం యువతకు ఎంతగానో ఇన్స్పిరేషన్ గా నిలుస్తున్న విజయ్ దేవరకొండ ఇప్పుడు భారీ స్థాయిలో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాడు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ అనే సినిమాను ఇప్పటికే పూర్తి చేసిన విజయ్ దేవరకొండ ఆ తర్వాత శివ నిర్వాణ మరియు సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. అంతేకాదు జనగణమన లో ప్రాజెక్టులో కూడా విజయ్ కథానాయకుడిగా నటిస్తున్నాడు. ఆ విధంగా విజయ్ దేవరకొండ తో పనిచేస్తున్న దర్శకుల వరస చూస్తుంటే అందరూ కూడా అగ్ర దర్శకులు కావడం విశేషం.
మరి పెద్ద హీరోలతో మాత్రమే సినిమాలు చేసే దర్శకులు సైతం యువ హీరో విజయ్ దేవరకొండ తో సినిమాలు చేయడం కొంత మంది హీరోలకు మింగుడు పడకపోయినా కూడా ఈ హీరో ఇప్పుడు చేస్తున్న పాన్ ఇండియా ఎంట్రీ ఏ స్థాయిలో ప్రేక్షకులను అలరిస్తుందో చూడాలి. త్వరలోనే ఆయన శివ నిర్మాణ దర్శకత్వంలో అనే సినిమాను మొదలు పెట్టబోతున్నాడు. సమంత కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా కాశ్మీర్ బ్యాక్ డ్రాప్ లో ప్రేక్షకులను అబ్బురపరిచే ప్రేమకథ సినిమా గా తెరకెక్కుతుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి