ఇక ఈ ఏడాది బాలీవుడ్ మిస్టర్ పర్ ఫెక్ట్ అమీర్ ఖాన్ నటిస్తున్న 'లాల్ సింగ్ చద్దా' చిత్రంతో బాలీవుడ్ కు వెళుతున్న నాగచైతన్య మరో పక్క తెలుగులో 'మనం' ఫేమ్ విక్రమ్ కె. కుమార్ డైరెక్షన్ లో రూపొందుతున్న 'థాంక్యూ' సినిమాలో నటిస్తున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. రాశీఖన్నా అవికా గోర్ హీరోయిన్ లుగా నటించిన ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.ఇదే సమయంలో విక్రమ్ కె. కుమార్ తో ఫస్ట్ వెబ్ సిరీస్ 'దూత'లో నటిస్తున్నారు నాగచైతన్య ఓ పక్క వెబ్ సిరీస్ లో నటిస్తూనే తాజాగా మరో సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. చైతూ 22వ సినిమాగా తెరపైకి రానున్న ఈ సినిమాని తెలుగు తమిళ భాషల్లో ఏక కాలంలో బై లింగ్వల్ గా తెరకెక్కించబోతున్నారు. చైతూ నటిస్తున్న తొలి తమిళ  సినిమా ఇది.విభిన్న సినిమాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న వెంకట్ ప్రభు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.



 ప్రస్తుతం తెలుగులో క్రేజీ సినిమాలని నిర్మిస్తున్న స్టార్ ప్రొడ్యూసర్ శ్రీనివాస చిట్టూరి శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్ బ్యానర్ పై ఈ సినిమాని నిర్మించనున్నారు.బుధవారం నాడు మేకర్స్ ఈ ప్రాజెక్ట్ ని అధికారికంగా ప్రకటించారు. రీసెంట్ గా శింబు హీరోగా నటించిన 'మానాడు' సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ని సొంతం చేసుకున్న వెంకట్ ప్రభు తొలి సారి తెలుగులో చేస్తున్న సినిమా ఇది కావడంతో ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. వెంకట్ ప్రభు సినిమా అంటే టెక్నికల్ గా స్టోరీ పరంగా చాలా ప్రత్యేకత వుంటుదన్నది అందిరికి కూడా తెలిసిందే. అందుకు తగ్గట్లుగానే ఈ సినిమాకి టాప్ మోస్ట్ టెక్నీషియన్స్ వర్క్ చేయబోతున్నారు.పక్కా కమర్శియల్ ఎంటర్ టైనర్ గా రూపొందనున్న ఈ సినిమాలో పాపులర్ నటీనటులు నటించనున్నారు. వారికి సంబంధించిన మరిన్ని వివరాలు కూడా త్వరలోనే తెలియనున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: