సినిమా ఇండస్ట్రీలోకి  ఎంతో మంది ముద్దుగుమ్మలు ఎంట్రీ ఇస్తూ ఉంటారు.  అలా ఎంట్రీ ఇచ్చే వారిలో కొంత మందికి ఇండస్ర్టీలోకి ఎంట్రీ ఇచ్చిన వెంటనే క్రేజీ సినిమా అవకాశాలు ఎక్కువగా దక్కుతూ ఉంటాయి.  మరి కొంత మందికి మాత్రం అందం , అభినయం,  నటన ఈ మూడు కలబోసుకొని  ఉన్నప్పటికీ కూడా సినిమా అవకాశాలు పెద్దగా వారి దరికి చేరవు.  అలా అందం, అభినయం,  నటన ఈ మూడు కలబోసుకుని ఉన్నప్పటికీ పెద్దగా సినిమా అవకాశాలు తెలుగు సినిమా ఇండస్ట్రీలో పొందలేకపోతున్న హీరోయిన్ లలో సోనాల్ చౌహాన్ ఒకరు.

సోనాల్ చౌహాన్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎక్కువ శాతం నందమూరి నటసింహం బాలకృష్ణ సినిమాలో హీరోయిన్ గా నటించింది. బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన లెజెండ్ , డిక్టేటర్ , రూలర్ సినిమాలో ఈ ముద్దుగుమ్మ కథానాయికగా నటించింది.  అలాగే రామ్ పోతినేని సరసన పండగ చేస్కో సినిమాలో సోనాల్ చౌహాన్ కథానాయికగా నటించింది. ఇలా ఈ సినిమాలలో నటన పరంగా,  అందచందాల పరంగా ప్రేక్షకులను సోనాల్ చౌహాన్ బాగానే అలరించినప్పటికి  తెలుగు సినిమా ఇండస్ట్రీలో మాత్రం సోనాల్ చౌహాన్ కి పెద్దగా అవకాశాలు దక్కలేదు.  

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం సోనాల్ చౌహాన్ ,  నాగార్జున హీరోగా తెరకెక్కుతున్న ది ఘోస్ట్  సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.  ఈ సినిమాకు టాలీవుడ్ యంగ్ దర్శకుడు ప్రవీణ్ సత్తార్ దర్శకత్వం వహిస్తున్నాడు.  ఈ సినిమా మంచి విజయం సాధించినట్లు అయితే సోనాల్ చౌహాన్ కు తెలుగు సినిమా ఇండస్ట్రీలో క్రేజీ సినిమా అవకాశాలు దక్కే అవకాశం ఉంది అని పలువురు అభిప్రాయపడుతున్నారు.  మరి ది గోస్ట్ సినిమా సోనాల్ చౌహాన్ కు ఎలాంటి క్రేజ్ ను తీసుకు వస్తుందో చూడాలి. ప్రస్తుతం ది ఘోస్ట్ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: