‘ఆచార్య’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు పవన్ రాకపోవడంతో అతడి అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఇలాంటి పరిస్థితులలో పవర్ స్టార్ అభిమానుల నిరాశను తొలిగించే ఒక లీక్ ఇచ్చి చరణ్ వారి అభిమానాన్ని పొందే ప్రయత్నాలు చేస్తున్నాడు. తన జీవితంలో రెండు రకాల ధ్యేయాలు ఉన్నాయని ఒకటి తన తండ్రి చిరంజీవితో నటించడం అయితే మరొకటి తన బాబాయి పవన్ తో నటించే ఖచ్చితమైన ఉద్దేశ్యం తనకు ఉంది అంటున్నాడు.


ఆసినిమాను కూడ తానే నిర్మిస్తానని అయితే ఆ ప్రాజెక్ట్ కు తగ్గ కథ మంచి దర్శకుడు దొరకాలి అంటున్నాడు. అయితే ఆకథ ఎప్పటికి దొరుకుతుందో తనకు తెలియదని అంటున్నాడు. ప్రస్తుతం పవన్ ఇస్తున్న లీకుల ప్రకారం రాబోయే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల తరువాత తాను ఇక సినిమాలలో నటించను అని అర్థం వచ్చేలా చెపుతున్నాడు.


ప్రస్తుతం చరణ్ అదేవిధంగా పవన్ తమతమ సినిమాలతో మరో రెండు సంవత్సరాల వరకు బిజీగా ఉంటున్నారు. వచ్చే ఎసెంబ్లీ ఎన్నికలు అయిన తరువాత రాజకీయ సమీకరణాలు పరిస్థితులు చాల మార్పులు వచ్చే ఆస్కారం కనిపిస్తోంది. అలాంటి మార్పులు తనకు కలిసి వస్తాయని పవన్ ఆశిస్తున్నాడు. దానికి తగ్గట్టుగానే పవన్ వ్యూహాలు ఉంటున్నాయి. పవన్ నటిస్తున్న సినిమాలు ఎప్పుడు విడుదల అవుతాయి అన్నది ఆమూవీ దర్శకులకే తెలియదు.


అలాంటి పరిస్థితులలో చరణ్ పవన్ లు కలిసి నటించే సినిమాకు కథ దొరకడం ఆ సినిమా పూర్తి అవ్వడం ఇవన్నీ జరగాలి అంటే మరికొన్ని సంవత్సరాలు పట్టే ఆస్కారం ఉంది. అప్పటి వరకు పవన్ అభిమానులు నిరాశ పడకుండా వేచి చూడవలసిన పరిస్థితి. ‘ఆచార్య’ మూవీ కలక్షన్స్ కు పవర్ స్టార్ అభిమానుల సపోర్ట్ కావాలి కాబట్టి వ్యూహాత్మకంగా చరణ్ ఈ లీకులు ఇస్తున్నాడు అనుకోవాలి. ‘కేజీ ఎఫ్ 2’ కలక్షన్స్ విషయంలో తెలుగు టాప్ హీరోలకు సవాల్ విసిరిన పరిస్థితులలో ‘ఆచార్య’ కలక్షన్స్ పై చిరంజీవి చరణ్ లు కూడ టెన్షన్ పడవలసిన పరిస్థితి..



మరింత సమాచారం తెలుసుకోండి: