బీస్ట్ : విజయ్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన బీస్ట్ మూవీ ట్రైలర్ విడుదల అయిన 24 గంటల్లో 2.22 మిలియన్ లైక్ లను సాధించింది. ఈ సినిమాకు అనిరుద్ రవిచంద్రన్ సంగీతం సమకూర్చాడు.
బిగిల్ : విజయ్ హీరోగా నయనతార హీరోయిన్ గా అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన బిగిల్ సినిమా ట్రైలర్ విడుదల అయిన 24 గంటల్లో 1.66 మిలియన్ లైక్ లను సాధించింది.
వలిమై : కోలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన అజిత్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన వలిమై సినిమా ట్రైలర్ విడుదలైన 24 గంటల్లో 1.32 మిలియన్ లైక్ లను సాధించింది. ఈ సినిమాకు హెచ్ వినోద్ దర్శకత్వం వహించగా ఈ సినిమాలో కార్తికేయ ప్రతినాయకుడి పాత్రలో నటించాడు.
ఆర్ ఆర్ ఆర్ : దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా ఆలియా భట్ , ఒలీవియా మోరిస్ హీరోయిన్ లుగా తెరకెక్కిన ఆర్ ఆర్ ఆర్ మూవీ ట్రైలర్ విడుదలైన 24 గంటల్లో 1.24 మిలియన్ లైక్ లను సాధించింది. ఈ సినిమాలో అజయ్ దేవగన్ , శ్రేయ , సముద్ర కని ఇతర ప్రధాన పాత్రలో నటించారు.
సర్కారు వారి పాట : సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా గీత గోవిందం ఫెమ్ పరుశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన సర్కారు వారి పాట సినిమా ట్రైలర్ విడుదల అయిన 24 గంటల్లో 1. 219 మిలియన్ లైక్ లను సాధించింది. ఈ సినిమాకు తమన్ సంగీతాన్ని సమకూర్చాడు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి