అయితే ఇటీవల రాధే శ్యామ్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రభాస్ దానితో ఆశించిన స్థాయి సక్సెస్ మాత్రం అందుకోలేకపోయారు. అందుకె ప్రస్తుతం చేస్తున్న ఈ సినిమాల విషయమై ఎంతో శ్రద్ధ పెట్టిన ప్రభాస్, దగ్గరుండి మరీ స్క్రిప్ట్ ని పరిశీలించి సినిమాల ఎంపిక చేస్తున్నారని అంటున్నారు. అయితే ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ అందరి అంచనాలు ఒకింత ఎక్కువగా పాన్ ఇండియా మూవీ సలార్ పైనే ఉన్నాయి. ఇటీవల కెజిఎఫ్ చాప్టర్ 1, చాప్టర్ 2 సినిమాలతో ఒకదానిని మించేలా మరొకటి అద్భుత విజయాలు సొంతం చేసుకున్న ప్రశాంత్ నీల్ నుండి వస్తున్న సినిమా కావడంతో తప్పకుండా సలార్ భారీ విజయం ఖాయం అని ప్రభాస్ ఫ్యాన్స్ భావిస్తున్నారు.
మరోవైపు ఆడియన్స్ కూడా సలార్ రిలీజ్ తరువాత బాక్సాఫీస్ సంచలనం సృష్టించడం ఖాయం అని అభిప్రాయపడుతున్నారు. అన్ని వర్గాల ఆడియన్స్ తో పాటు ముఖ్యంగా యువత, మాస్ ప్రేక్షకులని అలరించేలా సలార్ మూవీ సాగుతుందని, అలానే ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఈ మూవీని ఆదరిస్తారని ఆ విధంగా ఎంతో అత్యద్భుతంగా ప్రశాంత్ ఈ మూవీ స్క్రిప్ట్ రాసుకున్నారని ఇన్నర్ వర్గాల టాక్. మొత్తంగా ఈ సినిమా యొక్క సక్సెస్ కోసం మిగతా టీమ్ తో పాటు ఎంతో శ్రమిస్తున్న దర్శకుడు ప్రశాంత్ నీల్ మూవీ తో మెప్పిస్తే తప్పకుండా విజయం తథ్యం అని, అందుకే భారం మొత్తం ఆయనదే అంటున్నారు డార్లింగ్ ఫ్యాన్స్. కాగా ఈ మూవీ ఫస్ట్ లుక్ టీజర్ ఈ నెల చివరి వారంలో విడుదలవుతుందని సమాచారం.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి