అందాల ముద్దుగుమ్మ సమంత గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సమంత ఇప్పటివరకు ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించి ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న టాప్ హీరోయిన్లలో ఒకరిగా కొనసాగుతోంది. సమంత కేవలం తెలుగు సినిమాలలో మాత్రమే కాకుండా తమిళ్ సినిమాలలో కూడా నటించింది. అక్కడ కూడా సమంత మంచి క్రేజ్ ను సంపాదించుకుంది.  

కొంత కాలం క్రితం విడుదల అయిన ఫ్యామిలీ మాన్ సీజన్ 2 వెబ్ సిరీస్ లో కీలక పాత్రలో నటించిన సమంత ఈ వెబ్ సిరీస్ ద్వారా హిందీ ప్రేక్షకులను కూడా బాగానే అలరించింది. అలాగే అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన హీరోయిన్ గా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప పార్ట్ 1 సినిమాలో స్పెషల్ సాంగ్ లో కనిపించి తన హాట్ హాట్ అందాలతో అలరించిన సమంత పుష్ప సినిమాలో స్పెషల్ సాంగ్ తో పాన్ ఉండియా రేంజ్ లో గుర్తింపు ను తెచ్చుకుంది. ఇకపోతే సమంత ప్రస్తుతం  శాకుంతలం , యశోద సినిమాల షూటింగ్ లను పూర్తి చేసుకుంది.  

ఈ సినిమాలు త్వరలో విడుదల కాబోతున్నాయి. ఇది ఇలా ఉంటే తాజాగా సమంత తన ఫిట్నెస్ ట్రైనర్ ల గురించి సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ ప్రస్తుతం తెగ వైరల్ గా మారుతుంది. అసలు విషయంలోకి వెళితే...  సమంత కు ఎప్పుడు ఫిట్ గా,  ఫిట్నెస్ గా ఉండడం కోసం నిత్యం జిమ్ లో కసరత్తులు చేస్తూ ఉంటుంది అనే విషయం మనందరికీ తెలిసిందే.  ఇలా జిమ్ లో కసరత్తులు చేయడం కోసం సమంత ప్రత్యేకంగా జిమ్ ట్రైనర్ లను కూడా నియమించుకుంది.  మన్ కరానీ , జునైద్ షేక్ లతో నా  మార్నింగ్స్ , ఎక్కడికి వెళ్లినా వీళ్లిద్దరు నుండి మాత్రం తప్పించుకోలేక పోతున్నాను అని సమంత చేసిన పోస్ట్ ప్రస్తుతం తెగ వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: