టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ లో తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అవసరం లేని పేరు ప్రణీత. అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ తెలుగులోనే కాకుండా తమిళ సినిమాల్లో కూడా నటించి మంచి పేరు సంపాదించుకుంది .అయితే తెలుగులో చేసింది కొన్ని సినిమాలే అయినప్పటికీ కేవలం తన నటనతో ప్రేక్షకులను మెప్పించినా అవకాశాలు లేక ఇండస్ట్రీకి దూరంగా ఉంటోంది. ఇకపోతే కరోనా సమయంలో ఎవరికీ తెలియకుండా బెంగళూరులో రహస్యంగా వివాహం చేసుకొని అందరికీ షాక్ ఇచ్చిన ప్రణీత తాజాగా గర్భందాల్చి మరొకసారి అభిమానులకు షాక్ తో పాటు ఆనందాన్ని కూడా కలిగించింది.ఇటీవల అందుతున్న సమాచారం ప్రకారం ప్రణీత ఇంట్లో సీమంతం వేడుకలు చాలా ఘనంగా జరిగినట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా ఆమె సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి కాస్త బాగా వైరల్ గా మారుతున్నాయి. ఇక ప్రస్తుతం ప్రణీత సినిమాల విషయానికి వస్తే.. గతంతో పోల్చుకుంటే ఇటీవల ఆమెకు ఏమాత్రం అవకాశాలు లేవని చెప్పవచ్చు. అత్తారింటికి దారేది సినిమాలో సమంతా కు అక్క గా నటించిన ఈమె తన నటనతో ప్రేక్షకులను బాగా మెప్పించింది. కానీ అవకాశాలు మాత్రం తెచ్చుకోలేక పోయింది.2021 మే 30వ తేదీన ప్రముఖ వ్యాపార వేత్త బెంగళూరుకు చెందిన నితిన్ రాజును వివాహమాడిన ఈమె ఇటీవల గర్భందాల్చి తన అభిమానులకు ఆనందాన్ని కలుగ చేసింది. ఇకపోతే పుట్టబోయే బిడ్డ కోసం ఇప్పటి నుంచి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఇక బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ప్రణీత మళ్లీ ఇండస్ట్రీలోకి అడుగు పెడుతుందా లేక ఇండస్ట్రీకి శాశ్వతంగా దూరమై కొడుకు భవిష్యత్తు కోసం గృహిణిగా మారుతున్న ప్రస్తుతం అభిమానులలో రేకెత్తిస్తోంది. ఏది ఏమైనా బిడ్డ సంరక్షణ కోసం ఒక సంవత్సరం అయిన తర్వాత మళ్ళీ ఇండస్ట్రీలోకి ఆమె అడుగు పెట్టాలని అభిమానులు కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: