విలక్షణ నటుడు కమల్ హాసన్ గురించి ప్రత్యేకంగా చెపాల్సిన పనిలేదు..ఆయన చేస్తున్న సినిమాలకు మార్కెట్ లో మంచి డిమాండ్ వుంటుంది.. కానీ ఇటీవల వస్తున్న సినిమాలకు పెద్దగా ఆదరణ లేదు. దాంతో ఇప్పుడు కాస్త టైం తీసుకొని మరి మరో సినిమాను చేస్తున్నారు.కమల్ హాసన్, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్  కాంబినేషన్‪లో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ 'విక్రమ్'.. ఇప్పటికే అన్నీ కార్యక్రమాలను పూర్తీ చేసుకొని విడుదలకు సిద్ధంగా వుంది.ఇప్పటి వరకూ ఈ సినిమాపై వస్తున్న రెస్పాన్స్ ను చూస్తె సినిమా భారీ హిట్ అనే టాక్ ఇండస్ట్రీలో చక్కర్లు కోడుతుంది..సినిమాపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ చిత్రంలో కమల్ హాసన్ హీరోగా నటించడమే కాకుండా, రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై ఆర్ మహేంద్రన్‌తో కలిసి నిర్మించారు కూడా. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి, ఫహద్ ఫాసిల్ పవర్ ఫుల్ పాత్రలలో నటిస్తుండగా.. హీరో సూర్య అతిథి పాత్రలో అలరించనున్నారు. ఈ చిత్రం జూన్ 3న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‪గా విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఈ చిత్ర రైట్స్‪ని.. టాలీవుడ్ కి చెందిన ఓ ప్రముఖ సంస్థ సొంతం చేసుకుంది.టాలీవుడ్ వెర్సటైల్ స్టార్ నితిన్ హోమ్ బ్యానర్ శ్రేష్ట్ మూవీస్ ఫ్యాన్సీ ధరకు 'విక్రమ్' తెలుగు రాష్ట్రాల హక్కులను సొంతం చేసుకుంది. టాలీవుడ్‌లోని ప్రముఖ నిర్మాణ, డిస్ట్రిబ్యూషన్ సంస్థలలో ఒకటైన శ్రేష్ట్ మూవీస్.. ఈ చిత్ర హక్కులను సొంతం చేసుకోవడమే కాకుండా.. సినిమాకి సంబంధించి భారీ ప్రమోషనల్ కార్యక్రమాలని ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అలాగే, భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు శ్రేష్ట్ మూవీస్ సన్నాహాలు చేస్తుంది..కాళిదాస్ జయరామ్, నరైన్, అర్జున్ దాస్, శివాని నారాయణన్ వంటి వారు ఈ చిత్రంలో ప్రముఖ పాత్ర ల్లో నటిస్తున్నారు.. అందుతున్న సమాచారం ప్రకారం సినిమా హిట్ అనే టాక్ గుస గుసలు వినిపిస్తున్నాయి.. మరి ఎలా ఉంటుందో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే..

మరింత సమాచారం తెలుసుకోండి: