టాలీవుడ్ క్రేజీ హీరోల్లో ఒకరైన నీతిని గురించి తెలుగు సినీ ప్రేమికులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నితిన్ టాలీవుడ్ ఇండస్ట్రీలో జయం సినిమాతో హీరోగా తన కెరియర్ ను మొదలు పెట్టాడు.  ఆ తర్వాత సై సినిమాతో అదిరిపోయే విజయాన్ని అందుకున్నాడు. కాకపోతే సై మూవీ తర్వాత వరుస అపజయాలను బాక్సాఫీస్ దగ్గర ఎదుర్కొన్న నితిన్ 'ఇష్క్' మూవీ విజయంతో  ఫుల్ ఫామ్ లోకి వచ్చాడు. ఈ సినిమా తర్వాత నితిన్ ఎప్పటికప్పుడు విజయాలను బాక్సాఫీస్ దగ్గర అందుకుంటూ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజీ హీరో గా కొనసాగుతున్నాడు.

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం నితిన్ 'మాచర్ల నియోజకవర్గం' మూవీ లో  హీరో హీరోగా నటిస్తున్నాడు.  ఈ సినిమాకు రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా ఈ సినిమాను నితిన్ తన సొంత బ్యానర్ శ్రేష్ట మూవీస్ పై నిర్మిస్తున్నాడు.  ఈ సినిమా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కొంత భాగం పూర్తి అయ్యింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో నితిన్ సరసన కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం మాచర్ల నియోజకవర్గం సినిమా పాటల చిత్రీకరణ కోసం చిత్ర బృందం ఇటలీ కి వెళ్ళింది.

అక్కడ మధ్య కాస్త ఖాళీ సమయం దొరకడంతో ఆ సమయాన్ని వృధా చేయడం ఇష్టం లేని నితిన్ తన తదుపరి సినిమా దర్శకుడు వక్కంతం వంశీ , హీరోయిన్ శ్రీ లీల కెమెరామెన్,  కొరియోగ్రాఫర్ లను ఇటలీకి రప్పించి , నితిన్ , శ్రీ లీల పై సాంగ్స్ ని చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది.  ఇలా ఇటలీలో ఖాళీగా ఉన్న సమయాన్ని తన తదుపరి సినిమా షూటింగ్ కు ఉపయోగించుకుంటూ డబ్బులు మరియు సమయాన్ని నితిన్ ఆదా చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.  నితిన్ హీరోగా వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాకు కూడా నితిన్ నే నిర్మాత కావడం విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి: