తెలుగు సినిమా ఇండస్ట్రీలో గత కొన్ని సంవత్సరాలుగా తనదైన నటన ఎంటర్టైన్మెంట్ చేస్తూ మంచి సక్సెస్ ఫుల్ హీరోగా పేరుపొందాడు హీరో అడవి శేషు. అయితే తాజాగా మేజర్ సినిమాలో నటిస్తున్నాడు ఈయన. ఈ సినిమా ప్రమోషన్లలో పాల్గొనడం అడవి శేషు స్టార్ డైరెక్టర్ తనని మోసం చేశారని తెలియజేయడం జరిగింది. అడవి శేషు నటించిన మేజర్ చిత్రం ఒకేసారి తెలుగులో హిందీ, మలయాళం లో కూడా విడుదల చేయబోతున్నారు. పెద్ద సినిమాలు విడుదల కారణంగా ఈ చిత్రం పలుసార్లు వాయిదా పడుతూ వస్తోంది. ఎట్టకేలకు ఈ చిత్రం జూన్ 3వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.


సినిమా విడుదల దగ్గరగా ఉండడంతో చిత్ర మేకర్ ప్రమోషన్స్ పనిలో చాలా బిజీగా ఉన్నారు ఇటీవల ట్రైలర్ ను కూడా విడుదల చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఇక ఈ ట్రైలర్ ప్రేక్షకుల అంచనాలను పెంచేసిందని చెప్పవచ్చు. తాజాగా కమెడియన్ ఆలీ షో లో పాల్గొనడం జరిగింది అడవి శేషు. అందులో కొన్ని ప్రశ్నలకు పలు ఆసక్తికరమైన సమాధానాలు తెలియజేశారు. తన కెరియర్ మొదటి నుంచే స్టార్ హీరోలు తనను ఎక్కువగా సపోర్ట్ చేసే వారని తెలియజేశారు.


పంజా సినిమా షూటింగ్ టైంలో పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేయగా.. క్షణం సినిమా సమయంలో అల్లు అర్జున్ సపోర్ట్ చేయగా.. బాహుబలి సినిమాలో ప్రభాస్ తనను దగ్గరుండి చూసుకుంటున్నారట. ఇక మేజర్ సినిమా తో మహేష్ బాబు నిర్మాతగా తనకు సపోర్ట్ చేస్తున్నారని తెలియజేశారు. తనకి 13 ఏళ్ళ వయస్సులోనే కెమెరాముందుకు వచ్చి నటించానని తెలియజేశారు. ఇదిలా ఉంటే తనని ఒక డైరెక్టర్ నమ్మించి మోసం చేశారనే విషయాన్ని తెలియజేశారు. తనకి అప్పుడు 15 సంవత్సరాలు.. చదువుకుంటున్న సమయంలోనే చందమామ సినిమాలో నవదీప్ చేసిన పాత్రలో ముందుగా ఈయననే అనుకున్నారట. ఆ పాత్ర కోసం రెండు రోజులు షూటింగ్ చేసి ఆ సినిమా ఆగిపోయింది అని తెలియజేశారట. ఆ తర్వాత సొంతం సినిమాలో కీలకమైన పాత్ర ఉంటుందని చెప్పి నటించిన తర్వాత.. మూడు రోజుల లోపల షూటింగ్ పూర్తిచేసి కేవలం సినిమాలో 5 నిమిషాలు మాత్రమే తన పాత్ర ఉండేలా చేశారని దాంతో తను మోసపోయానని  తెలియజేశాడు అడవిశేషు.

మరింత సమాచారం తెలుసుకోండి: