ఈవారం విడుదల కాబోతున్న ‘ఎఫ్ 3’ ఫలితం వచ్చిన తరువాత ఒక నెల గ్యాప్ తీసుకుని అనీల్ రావిపూడు వెంటనే బాలాకృష్ణ సినిమా వైపు వెళ్ళిపోతాడు. తెలుస్తున్న సమాచారంమేరకు బాలకృష్ణ బోయాపాటిల మూవీ షూటింగ్ ఆగష్టు నుండి ప్రారంభం అవుతోంది. ఈమూవీలో బాలకృష్ణ 60 సంవత్సరాల వయసులో ఉన్నప్పటికీ తాను ఇప్పటికీ యువకుడునే అన్న ఫీలింగ్ లో ఉంటాడట.పైకి గంభీరంగా కనిపిస్తున్నప్పటికీ చిన్న పిల్లవాడి మనస్తత్వంతో బాలయ్య చేసే కొన్ని విచిత్రమైన పనులు ఈమూవీలో హ్యాస్యాన్ని పండిస్తాయి అంటున్నారు. అంతేకాదు ఈమూవీలో బాలకృష్ణ లుక్ అతడి బాడీ లాంగ్వేజ్ చాల డిఫరెంట్ గా ఉండే విధంగా అనీల్ రావిపూడి డిజైన్ చేస్తున్నారట. ఇప్పటివరకు బాలకృష్ణను ఎవరు ఊహించని పాత్రలో తాను చూపించబోతున్నట్లు అనీల్ రావిపూడి లీకులు ఇస్తున్నాడు.ఈమూవీలో బాలకృష్ణ కూతురుగా పుష్పలీలను ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు. అయితే ఈమూవీలో బాలకృష్ణ భార్య పాత్రలో ఎవరు నటించాలి అన్న విషయమై ఇంకా తాను నిర్ణయం తీసుకోలేదని అనీల్ రావిపూడి చెపుతున్నాడు. అంతేకాదు ఈమూవీ ఇప్పటివరకు తాను తీసిన సినిమాలకు డిఫరెంట్ గా ఉంటుందని ఒకవిధంగా బాలయ్యను ఒక కొత్త కోణంలో చూపించే మూవీ అని అంటున్నారు. ఇప్పుడు ఈవార్తలు బాలయ్య అభిమానులకు కొంతవరకు గుబులు పుట్టిస్తున్నాయి.నందమూరి సింహం మాస్ హీరోలా కాకుండా ఒక ఉదాతమైన పాత్రలో నటిస్తే మాస్ ప్రేక్షకులు చూస్తారా అన్నది ప్రస్తుతానికి సమాధానం లేని ప్రశ్న. బాలయ్య నుంచి భారీ యాక్షన్ మూవీలను అతడి అభిమానులు ఆశిస్తూ ఉంటే ఇప్పుడు ఉదాత్తమైన పాత్రలో సున్నితమైన కామెడీ బాలయ్య చేయడం ఎంతవరకు కలిసి వస్తుందో చూడాలి. గతంలో బాలయ్య వయసు మీరిన లుక్ లో కొన్ని సినిమాలలో నటించినప్పటికీ అవి పెద్దగా సక్సస్ కాలేదు. అయితే ఇప్పుడు అనీల్ రావిపూడి చేతిలో బాలయ్య పాత్ర డిజైన్ చేయబడుతోంది కాబట్టి ఎదో ఒక మ్యాజిక్ ఉంటుందని ఆశిద్దాం..


మరింత సమాచారం తెలుసుకోండి: