తెలుగు సినీ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తున్న రామ్‌ చరణ్‌ మరియు శంకర్ ల కాంబో మూవీ షూటింగ్‌ శరవేగంగా సాగుతోందట.. రాజమౌళి స్థాయి దర్శకుడిగా శంకర్ కు మంచి పేరు ఉంది.


అద్బుతమైన కళా కండాలను ఆవిష్కరించిన ఘనుడు శంకర్‌ అనడంలో ఎలాంటి సందేహం కూడా లేదు. అలాంటి శంకర్ ప్రస్తుతం రామ్‌ చరణ్ తో సినిమా చేస్తున్నాడు అంటే తెలుగు ప్రేక్షకులు మెగా అభిమానులు అంతా కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. ఈ సినిమా యొక్క టైటిల్‌ విషయంలో గత కొన్ని రోజులుగా సస్పెన్స్ కొనసాగుతోందట. శంకర్‌ సినిమా అంటే చాలా సందేశం.. ఆసక్తికర కమర్షియల్‌ ఎలిమెంట్స్ కూడా ఉంటాయి. కనుక ఈ సినిమా కు కూడా అందుకు తగ్గట్లుగా ఒక మంచి కమర్షియల్‌ టైటిల్‌ ను పెట్టాలనే ఉద్దేశ్యంతో అధికారిని ఖరారు చేశారనే వార్తలు కూడా వస్తున్నాయి.


ఇక బాలయ్య సినిమా ప్రస్తుతం గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న సంగతి తెల్సిందే. ఆ సినిమాకు పలు టైటిల్స్ ను దర్శకుడు పరిశీలించాడు. చివరకు జై బాలయ్య అనే టైటిల్‌ ను ఖరారు చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అఖండ సినిమా లో జై బాలయ్య పాట ఉండటం వల్ల మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. అందుకే ఏకంగా టైటిల్‌ గానే బాలయ్య పేరు ఉంటే ఖచ్చితంగా జై బాలయ్య సినిమా బాగుంటుందని దర్శకుడు అనుకుంటున్నాడని సమాచారం.. జై బాలయ్య టైటిల్‌ దాదాపుగా కన్ఫర్మ్‌ అంటూ కూడా వార్తలు వస్తున్నాయి.


ఈ రెండు సినిమాల టైటిల్స్ విషయంలో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో పతాక స్థాయిలో చర్చ జరుగుతోందట.. మాకు తెలిసిన సమాచారం ప్రకారం శంకర్ అధికారి అని కాకుండా అన్ని భాషలకు ఒకే టైటిల్‌ సరిపోయే విధంగా అదే అర్థం వచ్చేలా ఒక టైటిల్‌ ను పరిశీలిస్తున్నాడట . అలాగే బాలయ్య మూవీ టైటిల్‌ విషయంలో ఇంకా తుది నిర్ణయం కూడా తీసుకోలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: