మాస్ మహరాజ్ రవితేజ సినిమా అంటే ఫ్యామిలీ మొత్తం ఎంటర్టైన్ అయ్యే అవకాశం ఉంది. అఫ్కోర్స్ ఆయన మాస్ ఫ్యాన్స్ కోసం యాక్షన్ మూవీస్ చేసినా సరే రవితేజ సినిమా అంటే ఫ్యామిలీ ఆడియెన్స్ ఇష్టపడతారు. రవితేజ మార్క్ కామెడీ టైమింగ్ కి ప్రేక్షకులు ఫిదా అవుతారు. ప్రస్తుతం రామారావు ఆన్ డ్యూటీ, రావణాసుర సినిమాలు చేస్తున్న రవితేజ నక్కిన త్రినాథరావు డైరక్షన్ లో ధమాకా సినిమా కూడా చేస్తున్న విషయం తెలిసిందే.

రవితేజ డ్యుయల్ రోల్ చేస్తున్న ఈ సినిమాలో ఒక కామెడీ సీక్వెన్స్ బాగా వచ్చిందట. సినిమా మొత్తానికి ఈ సీక్వెన్స్ హైలెట్ గా నిలుస్తుందని. ఈసారి ధమాకా రవితేజ ఫ్యాన్స్ కు డబుల్ బొనాంజా ఇవ్వడం ఖాయమని అంటున్నారు. నక్కిన త్రినాథ రావు సినిమాలన్ని చాలా ఎంటర్టైనింగ్ గా ఉంటాయి. అలాంటి డైరక్టర్ కి మాస్ మహరాజ్ రవితేజ దొరికితే ఎలా ఉంటుంది. ఖచ్చితంగా ధమాకా సినిమా ఆ అంచనాలకు తగినట్టుగానే ఉంటుందని అంటున్నారు.

క్రాక్ తో హిట్ కొట్టి మళ్లీ తన సత్తా చాటిన రవిఏజ ఆ నెక్స్ట్ వచ్చిన ఖిలాడి నిరాశపరచడంతో ఈసారి టార్గెట్ మిస్ అవకూడదని గట్టిగా ఫిక్స్ అయ్యారు. ఈ క్రమంలో చేస్తున్న రామారావు ఆన్ డ్యూటీ, ధమాకా, రావణాసుర సినిమాల విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ అవకుండా చూస్తున్నారు. సినిమా అవుట్ పుట్ బాగా వచ్చేందుకు సినిమా రిలీజ్ డేట్ ల విషయంలో కూడా హడావిడి ఏమి లేదని రవితేజ చెప్పారని టాక్. మొత్తానికి రవితేజ మళ్లీ తన ప్రాజెక్ట్ ల మీద పూర్తి ఫోకస్ పెట్టారని తెలుస్తుంది. అంతేకాదు తన దగ్గరకు వచ్చిన ప్రతి కథకు ఓకే చెప్పకుండా ఇక మీదట చాలా జాగ్రత్త పడాలని అనుకుంటున్నారట. సో రవితేజ నుండి ఇక నుండి అన్ని సూపర్ హిట్లే ఫ్యాన్స్ ఎక్స్ పెక్ట్ చేయొచ్చన్నమాట.  
   

మరింత సమాచారం తెలుసుకోండి: