హీరోగానే కాదు నిర్మాతగా కూడా తన టేస్ట్ ఏంటన్నది తెలియచేస్తున్న నాచురల్ స్టార్ నాని ప్రస్తుతం తన నిర్మాణంలో రెండు సినిమాలు చేస్తున్నాడు. అందులో ఒకటి తన సోదరి చేస్తున్న సినిమా కాగా మరొకటి శైలేష్ డైరక్షన్ లో వస్తున్న హిట్ 2. శైలెష్ డైరెక్ట్ చేసిన హిట్ ప్రేక్షకాదరణ పొందగా ఆ సినిమాకు సీక్వల్ గా వస్తున్న హిట్ 2 మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. హిట్ 2 సినిమాలో అడివి శేష్ నటిస్తున్నారు. సినిమాలో హీరోయిన్ గా మీనాక్షి చౌదరి నటిస్తుంది.

షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్ కు రెడీగా ఉన్న ఈ సినిమాకు డిజిటల్, హిందీ డబ్బింగ్ రైట్స్ రూపంలో రికార్డ్ డీల్ సెట్ అయ్యిందని తెలుస్తుంది. హిట్ 2 సినిమాలో డిజిటల్ రైట్స్ 7.5 కోట్లు పలికాయట. ప్రముఖ ఓటీటీ సంస్థ హిట్ 2 రైట్స్ సొంతం చేసుకుందని తెలుస్తుంది. ఇక ఈ సినిమా హిందీ డబ్బింగ్ రైట్స్ కూడా భారీ రేటు పలికాయని తెలుస్తుంది. హిట్ 2 హిందీ డబ్బింగ్ రైట్స్ 7.5 కోట్లు పలికినట్టు సమాచారం. సినిమా బడ్జెట్ 10 కోట్లు కాగా కేవలం డిజిటల్, హిందీ డబ్బింగ్ రైట్స్ రూపంలోనే సినిమా లాభాల బాట పట్టింది. ఇక ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ తో వచ్చేదంతా లాభమే అని చెప్పొచ్చు.

నిర్మాతగా నాని చాలా తెలివిగా సినిమాలు ప్లాన్ చేస్తున్నాడు. ఇక నాని నటిస్తున్న సినిమాల విషయానికి వస్తే వివేక్ ఆత్రేయ డైరక్షన్ లో వస్తున్న అంటే సుందరానికీ సినిమా వస్తుండగా ఆ సినిమా జూన్ 10న రిలీజ్ అవుతుంది. ఇక ఈ సినిమాతో పాటుగా నాని శ్రీకాంత్ ఓదెల డైరక్షన్ లో దసరా సినిమా చేస్తున్నాడు. దసరా సినిమాలో నాని మాస్ లుక్ తో కనిపించనున్నాడు. తెలంగాణా బ్యాక్ డ్రాప్ లో పీరియాడికల్ మూవీగా వస్తున్న నాని దసరా సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: