‘ఆర్ ఆర్ ఆర్’ మూవీ తరువాత విడుదలైన ‘ఆచార్య’ రామ్ చరణ్ కు ఊహించని షాక్ ఇచ్చింది. చిరంజీవి చరణ్ లు కలిసి నటించినా ఈ మూవీని మెగా అభిమానులు కూడ ఆదరించకపోవడం చరణ్ కు సమాధానం లేని ప్రశ్నగా మారింది. దీనికితోడు ఈ మూవీని అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతున్నప్పటికీ కనీసం సగటు ప్రేక్షకుడు ఫ్రీగా చూడటానికి కూడ ఇష్టపడక పోవడం చరణ్ కు మరింత ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నట్లు టాక్.


దీనితో చరణ్ తాను ప్రస్తుతం నటించబోతున్న సినిమాల విషయంలో చాల జాగ్రత్తలు తీసుకోవాలని ఒక స్థిర నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో నటిస్తున్న మూవీ కథ విషయంలో కూడ శంకర్ తో అనుక్షణం చర్చిస్తూ అనేక మార్పులు చేర్పులు చేస్తున్నట్లు టాక్.


అంతేకాదు ఈ మూవీ తరువాత రామ్ చరణ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నటించబోయే సినిమా కథ ఇప్పటికే ఫైనల్ అయినప్పటికీ ఆకథలో మళ్ళీ మార్పులు చేర్పులు చేయాలని చరణ్ అనుకుంటున్నట్లు తెలుస్తోంది. దీనితో ప్రస్తుతం రామ్ చరణ్ తో సినిమాలు తీస్తున్న దర్శకులు అందరి పైనా ‘ఆచార్య’ ఫెయిల్యూర్ ప్రభావం చాల స్పష్టంగా కనిపిస్తోంది అంటూ కామెంట్స్ వస్తున్నాయి.


‘ఆర్ ఆర్ ఆర్’ మూవీ తరువాత చరణ్ కు బాలీవుడ్ నుండి ఆఫర్లు వస్తున్నప్పటికీ ఆ ఆఫర్ల పై ఆచీతూచీ అడుగులు వేయాలని చరణ్ భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అదేవిధంగా ముంబాయ్ లో రామ్ చరణ్ ఒక స్పెషల్ పిఆర్ టీమ్ ను ఏర్పాటు చేసుకుని తనకు వచ్చిన నేషనల్ ఇమేజ్ తో జాతీయ స్థాయిలో పెద్ద బ్రాండ్స్ కు బ్రాండ్ అంబాసిడర్ గా మారాలని కొన్ని మల్టీ నేషనల్ కంపెనీలతో చర్చలు జరుపుతున్నట్లు టాక్. చరణ్ కు ప్రస్తుతం ఉన్న నేషనల్ ఇమేజ్ తో టాప్ బ్రాండ్స్ ఎండార్స్ మెంట్లు రావడం చాల సులువు..



మరింత సమాచారం తెలుసుకోండి: