దీంతో మిగతా కమెడియన్స్ పోల్చి చూస్తే సుడిగాలి సుదీర్ తక్కువ సమయంలోనే తెలుగు ప్రేక్షకులందరికీ కూడా ఎంతగానో దగ్గరయ్యారు. ఇక ఇప్పుడు జబర్దస్త్ లో టీం లీడర్ గా కొనసాగుతున్న విషయం తెలిసిందే. అంతే కాకుండా సినిమాల్లో హీరోగా కూడా అవకాశాలు దక్కించుకుంటున్నాడు. అయితే సుధీర్ కెరియర్ సాఫీగా సాగుతుంది అనుకుంటున్న సమయంలో ఇటీవలే ఓ అనూహ్యమైన నిర్ణయం తీసుకున్నాడు. జబర్దస్త్ నుంచి తప్పుకున్నాడు సుధీర్.
ఈ క్రమంలోనే ఇదే విషయంపై స్పందించిన మాజీ జబర్దస్త్ కమెడియన్ ధనరాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సుధీర్ ఎన్నో కష్టాలను అనుభవించింది కుటుంబ భారాన్ని భుజాలపై మోసి సుదీర్ ఈ స్థాయికి వచ్చాడు. మిమిక్రి ఆర్టిస్ట్ గా పని చేస్తున్న సమయంలోనే జబర్దస్త్ లో తన టీం లో పని చేసాడు అంటూ ధనాధన్ ధన్రాజ్ గుర్తుచేసుకున్నాడు. కెరియర్ మొదట్లో అతను ప్రతి ఒక్కరి దగ్గర ఎంతో మర్యాదగా గౌరవంగా నడుచుకునే వాడు. అతనిలో ఉన్న మంచితనమే ఇంత గొప్ప పేరు తెచ్చిపెట్టింది. సుధీర్ స్కిట్ లలో ఎంతోమంది తో తన పై పంచులు వేయించుకుంటు ఉంటాడు. కానీ సుధీర్ కి ఉన్న క్రేజ్ కి మాత్రం అందరిచేత పంచ్ లు చేయించుకోవాల్సిన అవసరం లేదు అంట ధనరాజ్ చెప్పుకొచ్చాడు..