ఇప్పటికే ఆ నిర్మాత తను నిర్మించిన రెండు చిత్రాల్లో ఆ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కి కీలక పాత్రలు ఇవ్వగా..ఇపుడు తన తదుపరి ప్రాజెక్ట్ లో కూడా ఆఫర్ ఇవ్వడంతో ఆ విషయం వైరల్ అయ్యింది. నిజానికి ఆ పాత్రకి మొదట వేరే సీనియర్ ఆర్టిస్ట్ అనుకుని ఫైనల్ చేశారట. అయితే మధ్యలో ఈ క్యారెక్టర్ ఆర్టిస్ట్ వచ్చి ఆ పాత్ర నేను చేస్తాను అనడంతో ఆ నిర్మాత ముందు వెనుక ఆలోచించకుండా సరే అంటూ ఆ సీనియర్ ఆర్టిస్ట్ ను తొలగించి ఆమె స్థానంలో ఈ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ను చేర్చడంతో విషయం చర్చనీయాంశం అయ్యింది. అసలు ఇలా ఎలా చేస్తారు అంటూ గట్టిగా అడుగుతోందట ఆ సీనియర్ ఆర్టిస్ట్. ఇలాచేయడానికి కారణం ఆమె కదా అంటూ పాయింట్ అవుట్ చేస్తూ నలుగురి ముందు నిలదీయడంతో వీరి రచ్చ అందరి ముందుకు వచ్చింది.
వీరి వ్యవహారం కాస్త మొన్నటి దాకా తెలిసి తెలియక ఉంది.. కానీ ఇపుడు నలుగురి ముందు బయట పడటంతో ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అంతా ఆ నిర్మాత ఆ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గురించే మాట్లాడుకుంటున్నారు. నిజానికి ఆ క్యారెక్టర్ ఆర్టిస్ట్ వయసు చాలా తక్కువ.. కానీ పాత్రలు మాత్రం కొంచం యేజ్డ్ తరహాలో ఇస్తుంటారు. హీరోయిన్ కి ఏమాత్రం తగ్గని అందంతో ఉన్న ఆ క్యారెక్టర్ ఆర్టిస్ట్ తో రిలేషన్ లో ఉన్న ఆ నిర్మాత ఏదేమైనా ఆమెని వదులుకోనేది లేదని అంటున్నారట. వాళ్ళ ఇంట్లో తెలిసి అడిగిన ఇదే మాట చెబుతున్నారట ఆ నిర్మాత. అంతగా ఆమె ప్రేమలో మునిగి తేలుతున్నారు మరి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి