డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ గురించి సినీ ప్రేమికులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పూరి జగన్నాథ్ తన కెరీర్ లో ఎన్నో హిట్ , సూపర్ హిట్ , బ్లాక్ బస్టర్ సినిమాలకు దర్శకత్వం వహించి టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న టాప్ దర్శకుల్లో ఒకరిగా ఇప్పటికి కొనసాగుతున్నాడు.  

పూరి జగన్నాథ్ తన కెరియర్ లో ఎక్కువ మాస్ యాక్షన్ సినిమాలకు దర్శకత్వం వహించి ఎన్నో విజయాలను అందుకున్నాడు. పూరి జగన్నాథ్ ఆఖరుగా రామ్ పోతినేని హీరోగా ఈస్మార్ట్ శంకర్ అనే మంచి మాస్ యాక్షన్ మూవీ ని తెరకెక్కించి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాడు. ప్రస్తుతం పూరి జగన్నాథ్ , విజయ్ దేవరకొండ హీరోగా లైగర్ మూవీ ని తెరకెక్కిస్తున్నాడు. అలాగే జనగణమన సినిమాకు కూడా దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో కూడా విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్నాడు. డైరెక్టర్ గా ఫుల్ క్రేజ్ ను సంపాదించుకున్న పూరి జగన్నాథ్ ఇప్పటికే తన కుమారుడు అయిన ఆకాష్ పురు ని సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇప్పించాడు. పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి ప్రస్తుతం హీరోగా సినిమాల్లో నటిస్తూ వస్తున్నాడు. ఆకాష్ పూరి తాజాగా చోర్ బజార్ సినిమాలో హీరోగా నటించాడు.

ఇలా ఇప్పటికే తన కుమారుడిని సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇప్పించిన పూరి జగన్నాథ్ త్వరలోనే తన కుమార్తె పవిత్ర పూరి ని కూడా సినిమా ఇండస్ట్రీలోకి తీసుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. కాకపోతే పూరి జగన్నాథ్ కూతురు హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వడం లేదు. పూరీ జగన్నాథ్ నిర్మాణ సంస్థ ‘పూరీ కనెక్ట్స్‌’లో పవిత్ర కూడా నిర్మాతగా ఉండనున్నట్టు సమాచారం. ఇలా పూరి జగన్నాథ్ తన కుమార్తెను కూడా సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇప్పించనున్నట్లు తెలుస్తోంది. ఈ వార్తకు సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: