టాలీవుడ్ ఇండస్ట్రీ లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఏర్పరచుకున్న లావణ్య త్రిపాఠి గురించి సినీ ప్రేమికులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అందాల రాక్షసి మూవీ తో టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు ను దక్కించుకున్న లావణ్య త్రిపాఠి ఆ తర్వాత అనేక టాలీవుడ్ ఇండస్ట్రీ లో అనేక మూవీ లలో నటించి టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ క్రేజీ హీరోయిన్ గా ఫుల్ పాపులారిటీని సంపాదించుకుంది. 

ఇది ఇలా ఉంటే తాజాగా లావణ్య త్రిపాఠి 'హ్యాపీ బర్త్ డే' అనే మూవీ లో కీలక పాత్రలో నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి మత్తు వదలరా మూవీ తో మంచి విజయాన్ని అందుకున్న రితేష్ రానా దర్శకత్వం వహించాడు. లావ‌ణ్య త్రిపాఠి ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ఈ మూవీ లో వివేక్ అగ‌స్థ్య ఒక ముఖ్యమైన  కీల‌క‌పాత్ర‌లో న‌టించాడు. ఇప్ప‌టికే ఈ మూవీ నుంచి విడుద‌లైన టీజ‌ర్‌ కు ప్రేక్షకుల నుండి విశేష స్పంద‌న లభిస్తుంది. కాగా ఈ మూవీ లోని  ముఖ్య పాత్ర‌ల్లో న‌టించిన నటి నటుల క్యారెక్ట‌ర్ ప్రోమో లను కూడా  చిత్ర బృందం సభ్యులు విడుదల చేస్తూ అంచ‌నాల‌ను పెంచేస్తున్నారు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని కొన్ని రోజుల క్రితం జూలై 15 వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అఫీషియల్ గా ప్రకటించింది.  

తాజాగా ఈ మూవీ ని చెప్పిన తేదీ కంటే ముందు అనగా జూన్ 8 వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఇలా లావణ్య త్రిపాటి ప్రధాన పాత్రలో తెరకెక్కిన హ్యాపీ బర్త్ డే మూవీ ని ముందు చెప్పిన తేదీ కంటే ముందుగా విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: