అందాల ముద్దుగుమ్మ సమంత గురించి సినీ ప్రేమికులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఏం మాయ చేసావే మూవీ తో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న దాదాపు అందరు స్టార్ హీరోల సరసన నటించి ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగుతోంది.

ఇది ఇలా ఉంటే సమంత ప్రస్తుతం తెలుగు లో శాకుంతలం , యశోద సినిమాల్లో నటించింది. ఈ రెండు సినిమాలు కూడా త్వరలోనే విడుదల కాబోతున్నాయి. ఇది ఇలా ఉంటే సమంత తెలుగు తో పాటు తమిళం లో కూడా అనేక సినిమాల్లో నటించి కోలీవుడ్ ఇండస్ట్రీ లో కూడా మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. ఇది ఇలా ఉంటే సమంత ఇప్పటి వరకు హిందీ లో మాత్రం ఏ సినిమాలో కూడా నటించలేదు.  సమంత కేవలం ది ఫ్యామిలీ మాన్ సీజన్ 2 వెబ్ సిరీస్ లో నటించినప్పటికీ, బాలీవుడ్ సినిమాలలో మాత్రం నటించలేదు. అయినప్పటికీ ఈ ముద్దుగుమ్మకు బాలీవుడ్ ఇండస్ట్రీ లో కూడా మంచి క్రేజ్ లభించింది. కొంతకాలం క్రితం విడుదలైన పుష్ప సినిమాలో స్పెషల్ సాంగ్ తో ఈ ముద్దుగుమ్మ పాన్ ఇండియా రేంజ్ లో ఫుల్ క్రేజ్ ను సంపాదించుకుంది.

ఇది ఇలా ఉంటే తాజాగా ఇండియా లో మోస్ట్ పాపులర్ హీరోయిన్ పెరుట ‘ఓర్మాక్స్ సంస్థ’...  ‘ఓర్మాక్స్ స్టార్స్ ఇండియా లవ్స్’   ఓ సర్వే ను నిర్వహించింది. ఈ సర్వేలో సమంత నెంబర్ 1 పొజిషన్ లో నిలిచింది. ఆ తర్వాత రెండవ స్థానంలో ఆలియా , భట్ ఆలియా భట్ , మూడవ స్థానంలో నయనతార నిలిచింది. ఈ లిస్ట్ లో కాజల్ అగర్వాల్‌,  కీర్తి సురేష్, కత్రినా కైఫ్, రష్మిక, పూజ హెగ్డే, అనుష్కా శెట్టి లకు కూడా చోటు దక్కింది. ఇలా సమంత ఇండియాలోనే నెంబర్ 1 హీరోయిన్ గా స్థానాన్ని దక్కించుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: