బాలీవుడ్ యంగ్ హీరోలలో ఒకరైన రన్బీర్ కపూర్ గురించి కొత్తగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . ఇప్పటి వరకు రన్బీర్ కపూర్ తెలుగు లో నేరుగా ఒక్క మూవీ లో కూడా నటించడం పోయినప్పటికీ హిందీ లో నటించిన మూవీ ల ద్వారానే రన్బీర్ కపూర్ తెలుగు లో కూడా ఫుల్ క్రేజ్ ని సంపాదించుకున్నాడు .

ఇది ఇలా ఉంటే తాజాగా రణబీర్ కపూర్ 'షంషేర్' అనే మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే . ఈ సినిమా మరి కొన్ని రోజుల్లో విడుదల కాబోతుంది.  ప్రస్తుతం ఈ సినిమా విడుదల సందర్భంగా రన్బీర్ కపూర్ అనేక ఇంటర్వ్యూ లలో పాల్గొంటూ మూవీ ని ఫుల్ గా ప్రమోట్ చేస్తూ వస్తున్నాడు. ఇందులో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రన్బీర్ కపూర్ కి ఒక ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది. ఆ ఆసక్తి కరమైన ప్రశ్నకు అంతే ఆసక్తికరమైన ప్రమాదాన్ని రన్బీర్ కపూర్ ఇచ్చాడు.  అసలు విషయం లోకి వెళితే ... షంషేర్ ప్రమోషన్ లో భాగంగా మీరు ఏ హీరో పాత్రతో చాలా ఆకట్టుకున్నారు అని అడిగినప్పుడు, రణబీర్ కపూర్ ఈ ప్రశ్నకు ఏ మాత్రం పెద్దగా ఆలోచించకుండా, అల్లు అర్జున్ 'పుష్ప' మూవీ లోని పుష్పరాజ్ పాత్రలో అంటూ చెప్పుకొచ్చారు.

అది మాత్రమే కాకుండా పుష్ప మూవీ లోని పుష్పరాజ్ పాత్రను తిరిగి పోషించడానికి ఇష్టపడతానని తాజా ఇంటర్వ్యూ లో రన్బీర్ కపూర్ చెప్పుకొచ్చాడు. షంషేర్ మూవీ ని తెలుగు లో కూడా విడుదల చేయనున్నారు. కొన్ని రోజుల క్రితమే షంషేర్ తెలుగు ట్రైలర్ ను చిత్ర బృందం విడుదల చేయగా ఈ ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ లభిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: