రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కే సినిమాలు ఎంతటి స్థాయిలో విజయాలను అందుకుంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సినిమాలకు కొంత ఎక్కువ సమయం తీసుకున్నా కూడా భారీ విజయాలు హీరోల ఖాతాలో పడతాయి. ఆ విధంగా హీరోలందరూ ఆయనతో
సినిమా చేయడానికి ఎంతో ఆసక్తిని చూపిస్తూ ఉంటారు. భారీ దర్శకుడు గా ఎదగాలంటే పోటీ నెలకొని ఉండటం సహజం. ఏ రంగంలో అయినా పోటీ ఉంటేనే మంచి ఫలితాలు వస్తూ ఉంటాయి. ఆ విధంగా
సినిమా పరిశ్రమలో దర్శకుల మధ్య పోటీ అనేది సహజం.
ఆ విధంగా భారీ సినిమాలను తెరకెక్కించే దర్శకుల మధ్య మంచి పోటీ ఏర్పడింది. వారే
జక్కన్న మరియు సుకుమార్. సుకుమార్ ఇటీవల చేసిన పుష్ప సినిమాతో తన ప్రతిభ ఏంటో అందరికీ నిరూపితం అయింది.
రాజమౌళి స్థాయిలో పాన్
ఇండియా సినిమాలను తెరకెక్కించి విజయాలను ఆకట్టుకోవాలంటే ఎంతో అనుభవం ఉండాలి అని అనుకున్నారు కానీ
సుకుమార్ పాన్
ఇండియా స్థాయిలో భారీ విజయాన్ని ఇంత సింపుల్ గా అందుకోవచ్చా అన్నట్లుగా ఆయన పుష్ప సినిమాను చేసి ఇంతటి స్థాయిలో కలెక్షన్లను రాబట్టాడు.
ముఖ్యంగా నార్త్ లో ఆ సినిమాకు వచ్చిన కలెక్షన్లు అన్నీ ఇన్ని కావు.
అల్లు అర్జున్ ఇమేజ్ కూడా ఈ సినిమాతో ఒక్కసారిగా పెరిగిపోయింది. అలా రాజమౌళికి
సుకుమార్ నుంచి మంచి పోటీ ఏర్పడింది అనే చెప్పాలి.
ఆర్ఆర్ఆర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన
రాజమౌళి ఇప్పుడు రాబోయే సినిమాతో వేరే స్థాయి సినిమానే చేయాలి. మహేష్ బాబుతో ఆయన తదుపరి
సినిమా చేసే విధంగా ముందుకు వెళుతున్నాడు.
సుకుమార్ కూడా
అల్లు అర్జున్ తో
సినిమా పూర్తి చేసిన తర్వాత లైగర్
విజయ్ దేవరకొండ తో
సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు. మరి పుష్ప రేంజ్ లో చేసుకుంటూ పోతే ఫ్యూచర్ లో
రాజమౌళి రేంజ్ కి ఆయన ఎదగడం ఖాయం అని చెప్పొచ్చు.