కన్నడ సినిమా ఇండస్ట్రీ లో హీరోగా తనకంటూ ఒక ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న కిచ్చ సుదీప్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కన్నడ సినిమా ఇండస్ట్రీ లో బాద్ షా కొనసాగుతున్న కిచ్చ సుదీప్ కన్నడ తో పాటు ఇతర భాషల సినిమాల్లో కూడా నటించి ఇతర సినిమా ఇండస్ట్రీలో కూడా తనకంటూ ఒక ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా కిచ్చ సుదీప్ 'విక్రాంత్ రోనా' అనే ఫాంటసీ నేపధ్యంలో అడ్వెంచురస్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే.

మూవీ ని భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కించారు.  ఈ మూవీ పై కన్నడ లో అదిరిపోయే రేంజ్ అంచనాలు ఉండగా ,  ఇతర భాషలలో కూడా ఈ మూవీ పై సినీ ప్రేమికులు పర్వాలేదు అనే రేంజ్ అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమా ఈ రోజు అనగా జూలై 28 వ తేదీన కన్నడ తో పాటు తెలుగు, మలయాళ, హిందీ, తమిళ భాషల్లో విడుదల కానుంది. ఇది ఇలా ఉంటే ఈ సినిమాపై తెలుగు ప్రేక్షకులు కూడా పర్వాలేదు అనే రేంజ్ అంచనాలు పెట్టుకోవడంతో ఈ మూవీ రెండే తెలుగు రాష్ట్రాల్లో కలిపి 1.2 కోట్ల ప్రీ రిలీజ్ చేసినట్లు జరుపుకుంది.

దానితో విక్రాంత్ రోనా మూవీ బాక్సా ఫీస్ దగ్గర క్లీన్ హిట్ గా నిలవాలి అంటే 1.4 కోట్ల షేర్ కలెక్షన్ లను వసూలు చేయవలసి ఉంది. సరైన హిట్ టాక్ కనుక వచ్చినట్లు అయితే విక్రాంత్ రోనా మూవీ కి 1.4 కోట్ల షేర్ కలెక్షన్ లు వసూలు చేయడం రెండు తెలుగు రాష్ట్రాల్లో  పెద్ద కష్టమైన పనేమీ కాదు.  మరి విక్రాంత్ రోనా మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ రేంజ్  కలెక్షన్ లను వసూలు చేస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: