ఇటీవలికాలంలో జబర్దస్త్ కామెడీ షో లో ఎంతోమంది కొత్త కమెడియన్స్ బాగా పాపులారిటీ సంపాదించుకున్నారు . ఇలా ఎక్కువ పాపులారిటీ సంపాదించుకున్న వారిలో జబర్దస్త్ ఫైమా కూడా ఒకరు అన్న విషయం తెలిసిందే. ఇక ఈ లేడీ కమెడియన్ తో పాటు ప్రవీణ్ అనే కమెడియన్  కూడా ఇటీవల జబర్దస్త్ పర్ఫార్మెన్స్ తో అందరి దృష్టిని తన వైపుకు తిప్పుకున్నాడు. వీరిద్దరూ కూడా ఒకప్పుడు ఈటీవీ లో ప్రసారం అయిన పటాస్ అనే కార్యక్రమం ద్వారా ఎంట్రీ ఇచ్చారు అనే విషయం తెలిసిందే. పటాస్ తో మొదలైన వీరి ప్రయాణం ప్రస్తుతం జబర్దస్త్ వరకూ వెళ్ళింది. ఇక ప్రస్తుతం జబర్దస్త్ లో ఏ స్కిట్ లో చూసిన కూడా మంచి కామెడీతో అలరిస్తున్నారు.


 అయితే ఇక జబర్దస్త్ లో ప్రతీ వారం కామెడీ పంచుతున్న ఈ ఇద్దరి మధ్య లవ్ రాక్ నడుస్తుంది అన్నది ఎన్నో రోజుల నుంచి బుల్లితెరపై జరుగుతూ వస్తున్న చర్చ అన్న విషయం తెలిసిందే. వీరిద్దరూ స్టేజ్ మీద ఒకరికి ఒకరు ఎన్నోసార్లు ప్రపోజ్ చేసుకున్నారు. ఇక ఇటీవలే జబర్దస్త్ కార్యక్రమం లో కూడా మరోసారి ప్రవీణ్ పైమా కి ప్రపోజ్ చేశాడు. తన కుటుంబ బాధ్యతలన్నీ ఒక అబ్బాయిల తానే తీసుకొని తన తల్లికి ఇల్లు కూడా కల్పించిందని.. అందుకే నాకు ఫైమా  అంటే ఎంతో బాగా నచ్చిందని ప్రపోజ్ చేశాడు ప్రవీణ్. అయితే ఇదంతా టిఆర్పి రేటింగ్ ల కోసం మాత్రమే అని అందరూ అనుకున్నారు.


 కానీ నిజంగానే ఫైమా, ప్రవీణ్ ప్రేమలో ఉన్నారని త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు అన్నదానికి కన్ఫర్మేషన్ మాత్రం ఇటీవలే క్యాష్ షో లో నే వచ్చింది అని చెప్పాలి. ఇటీవలే క్యాష్ షో లోకి జబర్దస్త్ కమెడియన్స్ జోడి లు ఎంట్రీ ఇచ్చారు. ఈ క్రమంలోనే ఫైమా, ప్రవీణ్ కూడా ఎంట్రీ ఇచ్చారు. అయితే ఇక ఒక ఫన్నీ టాస్క్ లో భాగంగా జబర్దస్త్ కమెడియన్స్ కి ఒక లై డిటెక్టర్ పెడతారు. యాంకర్ సుమ కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉంటుంది. నీకు బెస్ట్ కమెడియన్ అవార్డు ఇష్టమ.. లేకపోతే ప్రవీణ్ ఇష్టమా అని అడిగితే.. నాకు ప్రవీణ్ కావాలి అంటూ చెబుతోంది ఫైమా. అయితే అక్కడ లై డిటెక్టర్ మాత్రం తప్పు చెబుతుంది  అని సౌండ్ వచ్చిన.. నువ్వు ఎంత సౌండ్ చేసిన నాకు మాత్రం ప్రవీణ్ కావాలి అంటూ చెబుతుంది  ఫైమా. ఇలా చెప్పడం ద్వారా  వీరిద్దరూ ఎంత డీప్ లవ్ లో ఉన్నారు అన్న విషయం అర్థం అవుతుంది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: